News January 11, 2026
జగిత్యాల: పేపర్ లీకేజీలో నలుగురు సస్పెండ్.. 34మంది తొలగింపు

సర్వీస్‌లో ఉన్న ఏఈవోలు AG బీఎస్సీ పాస్ కావడానికి ఇల్లీగల్ పనులకు పూనుకున్నారు. AG కళాశాలకు చెందిన సిబ్బందితో కుమ్మక్కై పరీక్ష ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా లీక్ చేశారు. అయితే వరంగల్లో పేపర్ లీకేజీ కాగా, జగిత్యాల AG కళాశాలలో వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన యూనివర్సిటీ అధికారులు నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేయగా, లీకేజ్‌కు కారకులైన 34 మంది ఏఈఓలను కళాశాలల నుంచి తొలగించారు.
Similar News
News January 24, 2026
కొండగట్టు ఆలయ అర్చకుల నిరసనపై భక్తుల అభ్యంతరం

కొండగట్టు ఆలయ EO శ్రీకాంత్‌పై <<18936459>>అర్చకులు<<>> <<18935031>>నిరసన<<>> తెలపడంపై భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. EO ఆలయాభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు భక్తులు తెలిపారు. వాటిలో పేద, ధనికా తారతామ్యం లేకుండా భక్తులందరికీ ఒకేలా దర్శనం, ఆలయంలో కండువా, కనుము సంస్కృతికి చరమగీతం, సిబ్బంది పనితీరు మెరుగుపరచడం, భక్తులు హుండీలోనే కానుకలు వేసేలా చేసి ఆలయ ఆదాయాన్ని పెంచినట్లు భక్తులు చెప్తున్నారు.
News January 24, 2026
అమరావతి రెండో దశ విస్తరణకు టెండర్లు

అమరావతి నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన కోసం CRDA అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో పాల్గొనడానికి ఫిబ్రవరి 6వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. ప్రస్తుతం అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, రైతులకు ప్లాట్ల కేటాయింపు మొదలైంది. రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించేందుకు ఈ టెండర్లు పిలిచారు.
News January 24, 2026
తిరుమలలో 14 రకాల అన్నప్రసాదాల పంపిణీ

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం TTD భక్తుల కోసం 14 రకాల అన్నప్రసాదాలను సిద్ధం చేస్తుంది. గ్యాలరీల్లోని భక్తులందరికీ 85 ఫుడ్ కౌంటర్ల ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందేలా ప్రణాళికలు రూపొందించింది. వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకుల సేవలు వినియోగించనున్నారు.


