News January 11, 2026
తెలంగాణలో కాకినాడ జిల్లా యువకుడి అరెస్ట్

కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడిపికొండ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కిలో గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బండి నూతన ప్రసాద్(20) కాకినాడ జిల్లా చిన్నయ్యపాలెం వాసిగా గుర్తించారు. NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై బి.శివ తెలిపారు.
Similar News
News March 20, 2026
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విపత్తు శిక్షణ కేంద్రం: పొంగులేటి

అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తు నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని (SIDM) ఏర్పాటు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు శాస్త్రీయ శిక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు కీలమని పేర్కొన్నారు. డ్రోన్లు, హైస్పీడ్ బోట్లు వంటి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేస్తున్నామని, తెలంగాణను విపత్తు నిర్వహణలో ఆదర్శంగా నిలుపుతామని తెలిపారు.
News March 20, 2026
ధన్వాడ: మే 19న ఎస్టీ గురుకుల COE ప్రవేశ పరీక్ష

ఎస్టీ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజారాం తెలిపారు. పదో తరగతి పాసైన ఎస్టీ విద్యార్థులు మే 19న జరిగే ప్రవేశ పరీక్షకు tgtwreis.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
News March 20, 2026
రంజాన్ శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది: కలెక్టర్

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాసం, ప్రార్థనలు, జకాత్ వంటి దానధర్మాలు సహనం, సేవాభావం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రంజాన్ శాంతి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, అందరూ మత సామరస్యంతో పండుగను జరుపుకోవాలని సూచించారు. సమాజంలో ప్రేమ, పరస్పర గౌరవం పెరగాలని ఆకాంక్షించారు.


