News January 11, 2026
ఠాక్రేలు తలచుకుంటే 10 నిమిషాల్లో ముంబై బంద్: రౌత్

ముంబై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల వేళ శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ సంచలన కామెంట్స్ చేశారు. ఠాక్రే ఫ్యామిలీ పవర్ ఇప్పటికీ తగ్గలేదని, తలచుకుంటే కేవలం 10 నిమిషాల్లో ముంబైని స్తంభింపజేయగలరని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల తర్వాత BMC ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలవడంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఎన్నికల్లో ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఠాక్రేల క్రేజ్ తగ్గలేదంటూ ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News March 12, 2026
జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.
News March 12, 2026
గ్యాస్ కొరత.. రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా!

గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. LPGకి ప్రత్యామ్నాయంగా 40 వేల కిలోలీటర్ల అదనపు కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్ధిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్‌లో 28 భారత నౌకలు సేఫ్‌గా ఉన్నాయని కేంద్రం చెప్పింది. రోజూ 50Lసిలిండర్లు సరఫరా చేస్తున్నామంది.
News March 12, 2026
ఇరాన్‌కు వ్యతిరేకంగా UNSC తీర్మానం.. భారత్ మద్దతు

USపై ప్రతీకారం పేరుతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను భారత్ తప్పుబట్టింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి IND సహా 135 దేశాలు మద్దతు తెలిపాయి. ఇరాన్ వెంటనే దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి. ఓటింగ్‌కు చైనా, రష్యా దూరంగా ఉన్నాయి. ఈ తీర్మానాన్ని ఇరాన్ ఖండించింది. తమ పరిస్థితి రేపు మరో దేశానికి రావొచ్చని.. ఇలాంటి తప్పులు చేయొద్దని హెచ్చరించింది.


