News January 11, 2026
శ్రీశైలంలో సంక్రాంతి ఉత్సవాల ముఖ్య పూజలు ఇవే!

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి ఉత్సవాలు జరగనున్నాయి. అందులో భాగంగా 12 నుంచి 18 వరకు జరిగే ముఖ్య పూజా కార్యక్రమాలు ఇవే..
☞ 12న ధ్వజారోహణ ☞ 13న భృంగివాహనసేవ
☞ 14న కైలాసవాహనసేవ ☞ 15 నందివాహన సేవ, బ్రహ్మోత్సవ కళ్యాణం
☞ 16 రావణవాహనసేవ ☞ 17 పూర్ణాహుతి, త్రిశూలస్నానం, సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ
☞ 18 అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం.
★ ఉత్సవాల సందర్భంగా కొన్ని ఆర్జిత సేవల నిలుపుదల
Similar News
News February 17, 2026
KMR: కలిసొచ్చిన మూడు ఓట్లు.. చైర్ పర్సన్‌కు మలుపు

కామారెడ్డి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నిక మూడు రోజులపాటు మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించి కంటిమీద కునుకు లేకుండా చేసింది. చివరకు మూడు ఓట్ల తేడాతో 38వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పైనే విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్ రెబల్) మళ్లీ కాంగ్రెస్‌లో చేరి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె BRS మద్దతుతో పుర పీఠం ఎక్కడం గమనార్హం.
News February 17, 2026
ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.
News February 17, 2026
ములుగు: బంపర్ ఆఫర్.. రెడీగా రూ.55 కోట్ల ఫండ్!

సాధారణంగా కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతాయి. కానీ, ములుగు మున్సిపల్ కార్యవర్గానికి సమస్యలతో పాటు నిధులు వెల్ కమ్ చెబుతున్నాయి. మంత్రి సీతక్క చొరవతో మేజర్ పంచాయతీ హోదాలో మున్సిపాలిటీ ఏర్పాటైన తర్వాత మొత్తం రూ.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రతీ వార్డులో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి అనేక సమస్యలున్నాయి. వీటిని తీర్చుతూనే ముందుగా కోతుల సమస్యను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.


