News April 25, 2024
మోదీ పాలనపై నేడు కాంగ్రెస్ ఛార్జ్‌షీట్

TG: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ ఇవాళ ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నారు. పదేళ్ల మోదీ పాలనలో వైఫల్యాలను అందులో పేర్కొననున్నట్లు సమాచారం. అనంతరం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఆయన రోడ్ షోలు నిర్వహించనున్నారు.
Similar News
News February 4, 2026
కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.
News February 4, 2026
154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, MLT, BE/BTech, MSc, MA/MSW, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com
News February 4, 2026
వచ్చే నెలలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల

డైరెక్టర్ హరీశ్ శంకర్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.


