News January 11, 2026
మేడారం జాతరలో అత్యవసర సేవలకు 35 అంబులెన్సులు

మేడారం జాతరలో అత్యవసర వైద్య సేవలకు 35 అంబులెన్సుల సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతరలో గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించేందుకు అంబులెన్సులను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ ఆసుపత్రి, ఎంజీఎంకు తరలించడానికి 108 అంబులెన్స్‌లను ఉపయోగిస్తారు. హాస్పిటళ్లలో 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉంటారు.
Similar News
News March 25, 2026
రెండుగా విడిపోనున్న ‘కరీంనగర్’..?

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలను పెంచుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరీంనగర్ నియోజకవర్గం 2 నియోజకవర్గాలయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం KNR, KNR రూరల్, కొత్తపల్లి మండలాలతో ఒక నియోజకవర్గంగా ఉంది. KNR మండలాన్ని ఒక నియోజకవర్గంగా, కొత్తపల్లి, KNR రూరల్ మండలం కలిపి మరో నియోజకవర్గమయ్యే అవకాశాలు ఉన్నాయని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
News March 25, 2026
నేడు గుంటూరుకు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు గుంటూరుకు వెళ్లనున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూతురు వివాహానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. వేడుక అనంతరం రేవంత్ హైదరాబాద్ చేరుకొని అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
News March 25, 2026
వంటగ్యాస్ బుకింగ్.. కొత్త రూల్

సిలిండర్ల కొరత నేపథ్యంలో బుకింగ్ రూల్స్‌ను ఆయిల్ కంపెనీలు మరింత కఠినతరం చేశాయి. డబుల్ సిలిండర్ ఉన్నవారు 35 రోజుల తర్వాతే రీఫిల్ బుక్ చేసుకోవాలని పేర్కొన్నాయి. ఇక ఉజ్వల కనెక్షన్ ఉన్నవారికి ఈ గడువు 45 రోజులు కాగా సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత బుక్ చేయాలి. అంతకంటే ముందుగా చేసే బుకింగ్స్‌ను సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.


