News January 11, 2026

గంగూలీని దాటేసిన కోహ్లీ

image

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో గంగూలీ(308)ని దాటేశారు. ఇవాళ న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆయనకు 309వ వన్డే కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ జాబితాలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్(463) టాప్‌లో ఉన్నారు. ఇతర భారత ప్లేయర్లు ధోనీ(347), ద్రవిడ్(340), అజహరుద్దీన్(334) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఒకవేళ WC-2027 ఆడినా ధోనీని కోహ్లీ దాటడం కష్టమే.

Similar News

News March 19, 2026

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

image

సాధారణ అర్థంలో పరాభవ అంటే అవమానం, ఓటమి. దీని ప్రకారం ఈ సంవత్సరమంతా అపజయాలు ఉంటాయని కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించి ధర్మబద్ధంగా కష్టపడేవారికి విజయాలను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పరా-అమ్మవారు, భవ-ఉండు/ఆవిర్భావం/శివుడు అనే అర్థం. అంటే అమ్మవారికి సమీపాన ఉండటం లేదా పరాశక్తి ఆవిర్భావం లేదా అర్ధనారీశ్వర తత్వం అని కూడా అంటారు’ అని పేర్కొంటున్నారు.

News March 19, 2026

BREAKING: జాబ్ క్యాలెండర్ విడుదల

image

AP: 10,060 పోస్టులతో మంత్రి లోకేశ్ <<19422647>>జాబ్ క్యాలెండర్<<>> విడుదల చేశారు. ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నామని తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులందరూ ‘<>నైపుణ్యం<<>>’ పోర్టల్‌లో ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ చేసుకోవాలని సూచించారు. ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.

News March 19, 2026

16.7L మె.టన్నుల క్రూడ్ నిలిచిపోయింది: కేంద్రం

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతీయ జెండా ఉన్న 22 నౌకలు పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో చిక్కుకుపోయాయని నౌకాయాన మంత్రిత్వ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఇందులో 16.7L మె.టన్నుల క్రూడాయిల్, 3.2L మె.టన్నుల LPG, 2L మె.టన్నుల LNG ఉన్నాయని తెలిపారు. ఈ నౌకల్లోని 611 మంది ఇండియన్ నావికులు సురక్షితంగా ఉన్నారన్నారు. అన్ని దేశాలకు చెందిన దాదాపు 500 నౌకలు ఆగిపోయాయని పేర్కొన్నారు.