News January 11, 2026

చెరకు సాగుకు ఎలాంటి విత్తనం ఎంపిక చేయాలి?

image

చెరకు సాగులో రైతులు స్వల్పకాలిక రకాలను 40 శాతం, మధ్య, దీర్ఘకాలిక రకాలను 60 శాతం నాటుకుంటే పంట ఒకేసారి పక్వతకు రాకుండా దఫదఫాలుగా కోతకు వచ్చే వీలుంటుంది. రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే, పూత పూయని రకాలు లేదా 7-8 నెలల వయస్సు గల లేత తోటల నుంచి విత్తనాన్ని సేకరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతంలో ఈ సమస్యను తట్టుకునే రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

Similar News

News March 14, 2026

10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్?

image

AP: ఉగాది రోజున 60 విభాగాల్లో 10వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. డీఎస్సీలో భాగంగా 3,000కి పైగా టీచర్ పోస్టులు, 470 గ్రూప్-2, 101 గ్రూప్-1 పోస్టులు, వర్సిటీల్లో 1,500, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్‌లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయో మరో 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News March 14, 2026

జీడిమామిడి తోటల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

జీడిమామిడి తోటలను ఈ సమయంలో వాతావరణ మార్పుల కారణంగా కొమ్మ, పుష్ప గుచ్చాలను తొలిచే పురుగు, కాయ, గింజ తినే పురుగులు ఆశిస్తాయి. వీటిని గుర్తిస్తే అవసరాన్ని బట్టి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. మూడవ దఫాగా లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 1ML కలిపి పిచికారీ చేయాలి. వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 15-20 రోజుల వ్యవధిలో పంటకు తప్పనిసరిగా నీరు పెట్టాలి. దీని వల్ల జీడి పిక్కలు రాలడం తగ్గి కాయల సైజు కూడా పెరుగుతాయి.

News March 14, 2026

గ్యాస్ సిలిండర్ డెలివరీ ఆలస్యమైందా? కాల్ చేయండి!

image

బుక్ చేసిన సిలిండర్ రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేయాలనే రూల్ ఉంది. ఏజెన్సీలు సిలిండర్ పంపడంలో ఆలస్యం చేస్తే యూజర్లు ఆయిల్ కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1800-233-3555కు కాల్ చేసి గ్యాస్ ప్రొవైడర్‌ను తెలియజేస్తే సంబంధిత విభాగాలకు మీ ఫిర్యాదును బదిలీ చేస్తారు. బుకింగ్ కోసం HP-96660 23456, INDANE- 77189 55555, BHARAT-77150 12345 ఈ నంబర్లకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కాల్ చేయండి.