News January 11, 2026

మరణించిన వారిని దూషిస్తే..?

image

మరణించిన వ్యక్తిని నిందించినా, దూషించినా, అవమానించినా శాస్త్రాల ప్రకారం నేరం. మనుస్మృతి, భారతంలోని శాంతి పర్వం ప్రకారం.. వారు తిరిగి సమాధానం చెప్పలేరు కాబట్టి వారి గురించి చెడుగా మాట్లాడటం పిరికిపంద చర్యగా పేర్కొంటారు. ఇలా చేస్తే మనలోని సానుకూల శక్తి నశించి, ప్రతికూలత పెరుగుతుంది. మరణించిన వారు చేసిన తప్పుల కంటే వారిలోని మంచిని మాత్రమే గుర్తుంచుకోవాలి. లౌకిక బంధాలు ముగిసిన వారు దైవంతో సమానం.

Similar News

News February 20, 2026

అభిషేక్.. దొరికిపోతావ్ జాగ్రత్త: అమీర్

image

టీ20 ప్రపంచకప్‌లో అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ హెచ్చరించారు. అభిషేక్ ప్రతీ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది సరికాదని సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్వాలిటీ బౌలర్లు ఉంటారు కాబట్టి వీక్‌నెస్ పసిగట్టేస్తారని తెలిపారు. పాక్ ఓపెనర్ ఆయుబ్‌ తొలినాళ్లలో ఇలాగే ఆడి ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడేందుకు తడబడుతున్నాడని.. అభిషేక్ పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు.

News February 20, 2026

సర్పంచ్‌లకు గుడ్ న్యూస్

image

AP: సర్పంచ్‌లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో చేసిన తీర్మానాల ప్రకారం నిధులు వాడుకోవచ్చని పేర్కొంది. పనులు చేసిన తర్వాత మెజర్‌మెంట్స్ బుక్స్‌లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని వెల్లడించింది.

News February 19, 2026

RCBకి బంపర్ ఆఫర్.. $1.8బిలియన్ల బిడ్!

image

యాజమాన్య హక్కులపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బంపర్ ఆఫర్ వచ్చింది. స్టార్ ఫుట్‌బాల్ టీమ్ మాంచెస్టర్ యునైటెడ్ కో-ఓనర్ అవ్రామ్ గ్లేజర్ కొనుగోలుకు ఆసక్తి చూపించారు. 1.8 బిలియన్ డాలర్లకు (సుమారు ₹16,399కోట్లు) బిడ్ వేసినట్లు సమాచారం. ఇప్పటికే బ్లాక్‌స్టోన్, కార్లైల్ గ్రూప్ సహా బడా సంస్థలు ముందుకొచ్చాయి. దీంతో RCB ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం Diageo సంస్థ RCBకి ఓనర్‌గా ఉంది.