News January 11, 2026

ఇరాన్ నిరసనలకు ప్రధాన కారణమిదే..!

image

ఇరాన్‌ నిరసనలకు కారణం తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అసంతృప్తి. ధరల పెరుగుదల, కరెన్సీ పతనం, నిరుద్యోగం సామాన్యులను వీధుల్లోకి తెచ్చాయి. కఠిన మతపరమైన చట్టాలు, పౌర హక్కుల అణచివేత, దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2022లో ‘మహసా అమినీ’ మరణం తర్వాత మొదలైన స్వేచ్ఛా పోరాట స్ఫూర్తితో తమకు మెరుగైన జీవన ప్రమాణాలు, ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News March 17, 2026

ఇరాన్ సుప్రీంలీడర్ రష్యాలో ఉన్నారా?

image

US, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా <<19366915>>గాయపడినట్లు <<>>వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్యా మిలిటరీ విమానంలో రహస్యంగా ఆయన్ను మాస్కో తరలించారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అక్కడ విజయవంతంగా మొజ్తబాకు సర్జరీ చేసినట్లు కథనాల్లో పేర్కొంది. మరోవైపు సుప్రీంలీడర్ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఎక్కడ ఉన్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

News March 17, 2026

ఆస్కార్: దురదృష్టంలో ఈమెది ఆల్ టైమ్ రికార్డు!

image

ఆస్కార్ <<19394758>>అవార్డుల<<>> విషయంలో పాటల రచయిత డయానె వారెన్‌ది ఓ దురదృష్ట గాధ. దశాబ్దాలుగా నామినేషన్లలో ఉంటున్నా చివరికొచ్చే సరికి ఆమెకు నిరాశ తప్పడం లేదు. ఇలా ఏకంగా 17 సార్లు మొండిచెయ్యే దక్కింది. ఆస్కార్ చరిత్రలో ఇదో రికార్డు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వరుసగా 9 సార్లు ఎంపికైనా అదృష్టం మాత్రం వరించలేదు. ‘నేను కొత్త రికార్డు సృష్టించా. మీరు అనుమతిస్తే మరోసారి తిరిగొస్తా’ అని FBలో వారెన్ రాసుకొచ్చారు.

News March 17, 2026

మార్చి17: చరిత్రలో ఈరోజు

image

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)