News January 11, 2026

మంచిర్యాల: యువజన విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం

image

మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువజన విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు మహేశ్ వర్మ తెలిపారు. దండేపల్లి సందవేణి కిరణ్, కార్తీక్ యాదవ్, మందమర్రి గొల్లపల్లి అజయ్ గౌడ్, సందీప్, నస్పూర్ సతీష్, రంజిత్, తాండూర్ ఎం.రంజిత్, కె.సందీప్, కోటపల్లి దుర్గం సుధాకర్, రాజమౌళిలను అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

Similar News

News March 17, 2026

‘కలిసి పని’ అంటే హక్కుల్లో జోక్యం కాదు: జీవన్ రెడ్డి

image

సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పని చేస్తున్నామనే సాకుతో కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సహజమేనని, గతంలో తాను కూడా మాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేశానని గుర్తుచేశారు. అయితే, ఈ పేరుతో నామినేటెడ్ పదవులు, కార్యకర్తల హక్కుల విషయంలో తలదూర్చడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

News March 17, 2026

శాసనసభలో చీఫ్ విప్‌గా యెన్నం శ్రీనివాస్ రెడ్డి?

image

తెలంగాణ శాసనసభలో చీఫ్ విప్, విప్‌ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరికాసేపట్లోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ విప్‌లుగా పెద్దపల్లి MLA విజయ రమణారావు, నకిరేకల్ MLA మేముల వీరేశం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

News March 17, 2026

ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తా: జీవన్ రెడ్డి

image

TG: తాను <<19382690>>పార్టీ<<>> మారాలనుకునే ఆలోచనకు కారణం జగిత్యాల MLA సంజయ్ అని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌తో తనది 40 ఏళ్ల బంధమన్న ఆయన.. తనకు ఎంత ఇబ్బంది ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఇంకా కాంగ్రెస్‌లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. పార్టీ పిలుపు మేరకు 4 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టానన్నారు. చూడాలి జగిత్యాలలో మున్ముందు ఏం జరుగుతుందో.