News April 25, 2024
నెల్లూరు: ఆ రోజు వేతనంతో కూడిన సెలవు

ఎన్నికల నేపథ్యంలో మే 13న ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, దుకాణాల్లో పనిచేసే అర్హులైన రోజు వారి, సాధారణ, షిఫ్టుల వారి కార్మికులు ఓటు వినియోగించుకోవడానికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు కార్మిక ఉప కమిషనర్ వెంకటేశ్వర రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా యజమానులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, చట్టపరమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News October 13, 2025
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో మాజీ MLA అనుచరుడి మృతి

మాజీ MLA కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు పాలవెల్లి పద్మనాభరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జాతీయ రహదారిపై ముంగమూరు వద్ద బైక్‌పై వస్తుండగా కారు ఢీకొట్టింది. నెల్లూరులోని ఓ హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అల్లూరులో కాటంరెడ్డి అభిమానులతో కలిసి కావలికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కాటంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News October 13, 2025
నెల్లూరు: చేపలచెరువులకు ఆగని చికెన్ వ్యర్ధాల తరలింపులు

చేపల చెరువుల సాగుల్లో చికెన్ నిర్ధాల తరలింపు జిల్లాలో ఆగడం లేదు. ముఖ్యంగా కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బుచ్చి, పొదలకూరు, ఆత్మకూరు మండలాల నుంచి నిత్యం వాహనాల్లో చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్నారు. కొందరు వారి స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేసినప్పుడు అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.
News October 13, 2025
కందుకూరు: పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్

కందుకూరు (M) కోవూరు గ్రామ శివారులో ఆదివారం రాత్రి గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. కందుకూరు రూరల్ ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పాత అంగన్‌వాడీ భవనంలో పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు తెలిసింది. దాంతో ఆకస్మిక దాడి చేయగా 10 మందిని అరెస్ట్ చేసి రూ.6450 నగదును, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.