News January 11, 2026
నల్గొండ: గంజాయి విక్రయిస్తున్న వారి అరెస్టు

పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్న సయ్యద్ మజీద్ హుస్సేన్, సోహెల్‌ను టాస్క్‌ఫోర్స్, నల్గొండ రూరల్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో పట్టుకున్నారు. నిందితుల నుంచి నాలుగున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Similar News
News February 13, 2026
నల్గొండ: మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG కార్పొరేషన్ ఓట్లను ఆర్జాలబావిలో, మిర్యాలగూడ, నందికొండ, హాలియా ఓట్లను అవంతిపురంలో లెక్కించనున్నారు. దేవరకొండ, చండూరు, చిట్యాల ఫలితాలను ఎస్ఎల్బీసీ గురుకుల పాఠశాలలో వెల్లడించనున్నారు. అధికారులు పటిష్ట భద్రత మధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News February 13, 2026
జిల్లాలో 163 సెక్షన్ విధింపు – ఎస్పీ

జిల్లాలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఈ నెల 16 వరకు BNSS సెక్షన్ 163 (పాత 144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
News February 12, 2026
శాలిగౌరారం: చిన్నారిపై వీధి కుక్క దాడి

ఆకారం గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మనస్వి అనే 15 నెలల చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి తలపై తీవ్రంగా గాయపరిచింది. రక్తస్రావం కావడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది హేమంత్, సమీర్ చిన్నారిని హుటాహుటిన నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వీధి కుక్కల బెడదపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.


