News January 11, 2026

వరంగల్‌లో PDS బియ్యం సీజ్.. వ్యాపారుల కుమ్ములాట..!

image

రేషన్ బియ్యం దొంగల వ్యవహారం బయట పడింది. వరంగల్‌కు చెందిన రెండు వర్గాలు హన్మకొండలో రేషన్ బియ్యం దందా చేసే వారికి అమ్ముకునేందుకు ఉర్సుగుట్ట వద్ద ఓగోడౌన్‌లో 75 క్వింటాళ్ల రేషన్ బియ్యం దాచారు. పోలీసులు గోడౌన్ పై దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హన్మకొండ వ్యాపారుల వల్లే బియ్యం పట్టుకున్నారని వరంగల్ వ్యాపారులు గొడవపడగా స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 20, 2026

ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

image

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8

News February 20, 2026

పార్వతీపురం: ‘ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలను పూర్తి చేయాలి’

image

జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల కింద మంజూరైన గృహ నిర్మాణాలను ఉగాది పండగ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలో పీఎం జన్మన్, పీఎం గ్రామీన్, పీఎమ్ఏవై పథకాల కింద నిర్మిస్తున్న మొత్తం 7,187 గృహాలను గడువులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 5,594 గృహాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News February 20, 2026

VJA: బాలికపై లైంగిక దాడి.. యువకుడిపై పోక్సో కేసు

image

విజయవాడలోని సాయిరాం థియేటర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక(16)ను ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ప్రాంతానికి చెందిన హేమంత్ నాగసాయి అనే వ్యక్తి మాయమాటలతో బాలికను లోబర్చుకొని, శారీరకంగా లొంగదీసుకున్నట్లు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీఐ కొండలరావు, నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.