News January 11, 2026

తాడికొండలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

image

తాడికొండ (మ) లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చింత చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుళ్లూరుకి చెందిన అఖిల్ (19), తరుణ్(17) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గుంటూరు GGHలో చికిత్స పొందుతున్నారు. తుళ్లూరు నుంచి ఐదుగురు యువకులు తాడికొండ YCP ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబును కలిసి తిరిగి వచ్చే సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Similar News

News February 16, 2026

ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు: ఆర్ఐవో

image

జిల్లాలో ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆర్ఐవో రవి వెల్లడించారు. మొత్తం 28,550 మంది విద్యార్థులు (ప్రథమ సంవత్సరం 14,607, ద్వితీయ సంవత్సరం 13,943) 50 కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారు. పరీక్షల పర్యవేక్షణకు 700 మంది ఇన్విజిలేటర్లు, 5 సిట్టింగ్ స్క్వాడ్లు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు.

News February 16, 2026

ఎగ్జిమ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

image

ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి గడువును పెంచారు. ఫిబ్రవరి 15 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 22 వరకు పొడిగించారు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(MBA/PGDBA/PGDBM/MMS), ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో పాటు ICAIలో సభ్యత్వం ఉన్న అభ్యర్థులు అర్హులు. వయసు 21-28 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.eximbankindia.in

News February 16, 2026

అన్నమయ్య: ఉత్కంఠ.. కోర్టుకు మాజీ మంత్రి

image

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందుతుడిగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ సోదరులు సోమవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరు కానున్నారు. వారితో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరి కొంతమంది కూడా కోర్టుకు రానున్నారు. పలు కారణాల రీత్యా ఈనెల 2న మాజీ మంత్రి సోదరులు తంబళ్లపల్లె కోర్టులో వాయిదాకు గైర్హాజరవడంతో వారి తరఫు న్యాయవాదులు ఆబ్సెంట్ పిటిషన్ సమర్పించిన విషయం తెలిసిందే.