News April 25, 2024

ఖమ్మం: గురుకుల కళాశాలలో ప్రవేశానికి 28న పరీక్ష

image

బీసీ గురుకుల జూనియర్ కళాశాలలో, ఉమ్మడి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 28న పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి టి అంజలి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో 15 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. www.mjptbcwreis.gov.in వెబ్సైట్ ద్వారా విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 23, 2025

ఖమ్మం: కేయూ పీజీ పరీక్షలు వాయిదా

image

ఈనెల 26న ప్రారంభం కావాల్సిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ (రెగ్యులర్) 4వ సెమిస్టర్ పరీక్షలు జూన్ 6కు వాయిదా పడ్డాయి. మే 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం మంగళవారం తెలిపారు. ఏప్రిల్ 23 నుంచి 30 వరకు ప్రయోగ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

News April 23, 2025

భానుడి ఉగ్రరూపం.. ఆ మండలాల్లోనే అత్యధికం

image

ఖమ్మం జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తుంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5, బోనకల్, చింతకాని 41.4, కల్లూరు 39.8, సత్తుపల్లి 39.3 నమోదైంది.

News April 23, 2025

నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

image

ఖమ్మం జిల్లాలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్, ఏలువారిగూడెంలో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం ఖమ్మం నగరం, కల్లూరు మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

error: Content is protected !!