News January 11, 2026

భూత్పూర్ వద్ద రోడ్డు ప్రమాదం.. వృద్ధ దంపతుల మృతి

image

భూత్పూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన శేషయ్య (72), నవనీతమ్మ (64) దంపతులు మృతి చెందారు. SI చంద్రశేఖర్ తెలిపిన వివరాలు.. కుమారుడిని కలిసి కారులో తిరుపతి వెళ్తుండగా, వెనుక నుంచి మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. సీటు బెల్టు ధరించకపోవడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందులోని వారు సురక్షితంగా బయటపడ్డారు.

Similar News

News March 16, 2026

దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స

image

దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద అరుదైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామానికి చెందిన రత్నాగారి లత కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరారు. సర్జన్ డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలో సుమారు 7.1 కిలోల బరువున్న మల్టీపుల్ ఫైబ్రాయిడ్ గడ్డలను శస్త్రచికిత్స ద్వారా తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

News March 16, 2026

ఆస్తి పన్ను బకాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?

image

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వన్ టైమ్ స్కీమ్’ (OTS) ద్వారా బకాయిలపై 90% వడ్డీ మాఫీని పొందే సువర్ణ అవకాశం ఇది. ఇప్పటివరకు GHMC, CMC, MMC పరిధిలో 2.67 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుని, రూ. 52.08 కోట్ల వడ్డీని ఆదా చేసుకున్నారు. ఇప్పటికే 1.64 లక్షల నోటీసులు జారీ అయ్యాయి. జప్తు వారెంట్ల వంటి కఠిన చర్యలకు గురికాకుండా, వెంటనే మీ పన్ను బకాయిలను చెల్లించి భారీగా ఆదా చేసుకోండి!