News January 11, 2026

టెట్ నుంచి ఆ టీచర్లకు ఊరట?

image

సుప్రీంకోర్టు <<17587484>>తీర్పు<<>> నేపథ్యంలో టీచర్లు కూడా టెట్ రాస్తున్న విషయం తెలిసిందే. అయితే పరీక్ష సిలబస్‌లో తమకు సంబంధం లేని సబ్జెక్టులు ఉండటంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో 2011 ముందు నియమితులైన టీచర్లకు మినహాయింపునివ్వడంపై కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి రిపోర్టులు అడిగినట్లు సమాచారం. కేంద్రం నిర్ణయంతో 12 లక్షల మందికి పైగా టీచర్లకు ఊరట దక్కే అవకాశం ఉంది.

Similar News

News March 12, 2026

డొమెస్టిక్ సిలిండర్లకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్

image

TG: రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్‌కు కొరత లేదని.. దీనిపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. హోటల్ పరిశ్రమకు LPG అవసరాలు తీర్చడం పెద్ద సమస్య అని పేర్కొన్నారు. రేపు గ్యాస్ కంపెనీలతో సమావేశమై పరిస్థితిపై ఆరా తీసి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సిలిండర్లు బ్లాక్ చేస్తే ఏజెన్సీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.

News March 12, 2026

క్యాప్ జెమినీ సీఈవోతో మంత్రి లోకేశ్ భేటీ

image

AP: విశాఖలో క్యాప్‌జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్‌తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. సిటీలో ఆ సంస్థ పెట్టుబడులపైన చర్చలు జరిపారు. ఈ సందర్భంగా 20వేల ఉద్యోగాలు కల్పించేలా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని సంస్థను లోకేశ్ కోరారు. భూకేటాయింపులపై ఇప్పటికే మధురవాడ ఐటీ పార్క్‌లో 20ఎకరాలు పరిశీలించగా.. అడవివరం, ఆనందపురంలోని భూములను కూడా ప్రతినిధులు పరిశీలించారు.

News March 12, 2026

ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ

image

TG: KCR, హరీశ్ రావును ఇబ్బంది పెట్టడానికే కాళేశ్వరంపై ప్రభుత్వం ఘోష్ కమిషన్ వేసిందని వారి తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ KCR, హరీశ్, స్మితా సబర్వాల్, SK జోషి వేసిన పిటిషన్లపై ఇవాళ విచారణ జరిగింది. కమిషన్ నివేదిక ఆధారంగా ముఖ్య నేతలిద్దరినీ టార్గెట్ చేసి, దుష్ప్రచారం చేశారని లాయర్ వాదించారు. కాగా కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది.