News January 11, 2026

అన్నమయ్య జిల్లాలో రేపు అర్జీల స్వీకరణ

image

అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) ద్వారా సోమవారం ప్రజల నుంచి అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్‌లో నమోదు చేసుకోవచ్చని డీపీఆర్‌ఓ తెలిపారు. అవసరం అయితే మీకోసం కాల్ సెంటర్ 1100ను సంప్రదించగలరన్నారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్, జేసీ, డీఆర్‌ఓలు సమస్యలను స్వీకరిస్తారని అన్నారు.

Similar News

News February 1, 2026

BUDGET: బడుల్లో ‘కంటెంట్ క్రియేట్’ పాఠాలు

image

బడ్జెట్-2026లో భాగంగా SM రంగంలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా ప్రభుత్వం ‘కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్’ను ప్రకటించింది. 2030 నాటికి 15 వేల పాఠశాలలు, 500 కళాశాలల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీడియో ఎడిటింగ్, పాడ్‌కాస్టింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు. ఈ ల్యాబ్స్‌ను IICT నిర్వహిస్తుంది. నిరుద్యోగాన్ని తగ్గించి, గ్రామీణ యువత కూడా ఇంటి నుంచే సంపాదించేలా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

News February 1, 2026

ములుగు: ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

image

ములుగు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజల నుంచి వినతులు స్వీకరించే కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి ఉండదని, అనంతరం యథావిధిగా కొనసాగిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 1, 2026

‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

image

తిరుపతి జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి ‘మీ కోసం’ కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. పెండింగ్ అర్జీలు, ఫిర్యాదుల స్థితిగతులు తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుపతి కలెక్టరేట్‌లో PGRS. ఉంటుందన్నారు.