News January 11, 2026
మెదక్: వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2490 దుప్పట్లను జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కలెక్టర్‌కు అందజేశారు. దుప్పట్లను 17 బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 1556 మంది విద్యార్థులకు, 6 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో 932 మంది విద్యార్థులకు అందజేశారు. గొప్పగా స్పందించి, పెద్ద ఎత్తున దుప్పట్లు అందించిన వారికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 11, 2026
ఎన్నికల సరళిని పర్యవేక్షిస్తున్న కలెక్టర్

మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని, అధికారులు క్షేత్రస్థాయి సమాచారాన్ని నిరంతరం సేకరిస్తున్నారని వివరించారు. ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయాలన్నారు.
News February 11, 2026
రామాయంపేట: తొలి ఓటుతో బాధ్యత చాటిన స్మిత

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామాయంపేటలోని 4వ వార్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో యువతి స్మిత తన తొలి ఓటు హక్కును వినియోగించుకుంది. మొదటిసారి ఓటు వేయడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన ఈ శక్తివంతమైన హక్కును ప్రతి యువతీ యువకులు బాధ్యతగా వినియోగించుకోవాలని కోరింది. యువ ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
News February 11, 2026
మెదక్: నేడు సెలవు మంజూరు: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లుగా ఉన్న వారందరికీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసిందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున తప్పనిసరిగా ఓటు వేయాలని ఆయన సూచించారు. ఈ ఉత్తర్వులతో ఉద్యోగులందరికీ ఓటు వేసే మార్గం సుగమమైంది.


