News January 11, 2026
ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్‌టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.
Similar News
News February 14, 2026
జ్యోతికతో పెళ్లికి నిరాకరించిన సూర్య తండ్రి.. ఆ ఒక్క మాటతో!

ప్రేమికుల దినోత్సవం వేళ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక లవ్ స్టోరీ వైరలవుతోంది. వీరి పెళ్లికి తొలుత సూర్య తండ్రి శివకుమార్ అంగీకరించలేదట. ‘పెళ్లి చేసుకుంటే జ్యోతికనే చేసుకుంటా. లేదంటే ఒంటరిగా ఉంటా’ అని సూర్య కరాఖండిగా చెప్పడంతో తన మనసు మార్చుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 1999లో మొదలైన వీరి ప్రేమ 2006లో పెద్దల ఆశీస్సులతో పెళ్లిగా మారింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు.
News February 14, 2026
IND vs PAK: రేపు ‘మహా’ సంగ్రామం.. ఇప్పటి వరకు మనదే జోరు!

T20 WCలో IND vs PAK మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా 7-1తో మనదే ఆధిపత్యం. 2007 ‘బౌల్ అవుట్’ విక్టరీ నుంచి 2024 ‘న్యూయార్క్ లో-స్కోరింగ్ థ్రిల్లర్’ వరకు భారత్ తన సత్తాను చాటుతూనే ఉంది. విరాట్ కోహ్లీ మెల్బోర్న్ మిరాకిల్ (2022), బుమ్రా డెత్ ఓవర్ల మ్యాజిక్ (2024) వంటి మధుర జ్ఞాపకాలతో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రేపటి మ్యాచ్‌లోనూ దాయాదుల పోరు ఆసక్తికరంగా సాగనుంది. IND విజయాల ఫొటోలను పైన చూడొచ్చు.
News February 14, 2026
నేలలో అధిక తేమ వల్ల పంటల్లో కనిపించే సమస్యలు

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.


