News January 11, 2026

చచ్చిపోవాలనే ఆలోచనల నుంచి అలా బయటపడ్డా: మలయాళ నటి

image

డిప్రెషన్‌లో ఉన్న సమయంలో మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరమని హీరోయిన్ పార్వతీ తిరువోతు అన్నారు. ఒకానొక సమయంలో తీవ్రమైన ఒంటరితనంతో బాధపడ్డానని, ఆ టైమ్‌లో చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపారు. థెరపీ తీసుకోవడంతో దాని నుంచి బయటపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనను బాధపెట్టిన 2021లోని జనవరి, ఫిబ్రవరి నెలలను జీవితం నుంచి తీసేసినట్లు చెప్పారు. ఈ మలయాళ బ్యూటీ నాగచైతన్య ‘దూత’లో నటించారు.

Similar News

News February 8, 2026

మీకు PMJDY అకౌంట్ ఉందా?

image

అందరికీ బ్యాంక్ సేవలు అందాలనే ఉద్దేశంతో కేంద్రం 2014లో PM జన్ ధన్ యోజన(PMJDY) తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాలు లేని వారు ఏదైనా బ్యాంకులో PMJDY అకౌంట్‌ను ఓపెన్ చేయొచ్చు. దీనికి మినిమమ్ బ్యాలన్స్ మెయింటైన్ చేయాల్సిన పనిలేదు. రూపే డెబిట్ కార్డు, డిపాజిట్స్‌పై ఇంట్రెస్ట్, ₹2లక్షల ప్రమాద బీమా, ₹10వేల వరకు లోన్ వెసులుబాటు ఉంటుంది. DBT, ముద్ర, పెన్షన్ స్కీములకూ ఈ ఖాతా పనిచేస్తుంది. వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News February 8, 2026

నిద్ర ఎక్కువైనా ప్రమాదమే!

image

* ఎక్కువ సమయం నిద్రపోతే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
* ఇన్సులిన్‌ను నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది.
* మహిళల్లో సంతానోత్పత్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
* కండరాలు, నరాలు సంకోచించి శారీరకంగా అలసిపోతారు.
* తలనొప్పి, వెన్నునొప్పి వస్తాయి. డిప్రెషన్‌కు గురవుతారు.
* అలసట, నీరసంగా అనిపించి జంక్‌ఫుడ్/అధిక కేలరీలున్న ఫుడ్ తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది.

News February 8, 2026

2030లో కూలిపోనున్న ISS!

image

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని NASA చెబుతోంది. 1998లో స్పేస్‌లోకి అడుగు పెట్టిన ISSని 2030లో పసిఫిక్ మహా సముద్రంలో కూల్చేయనున్నారు. ఈ బాధ్యతను ‘Space X’కు అప్పగించింది. భూభాగానికి వేల KM దూరంలోని ‘పాయింట్ నీమో’లో కూలుస్తారు. ఇయర్లీ మెయింటినెన్స్ పెరగడం, అనుకున్న దానికంటే ఎక్కువ కాలమే స్పేస్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.