News January 11, 2026
మేడారంలో నో సిగ్నల్స్.. భక్తుల అసహనం

మేడారం మహా జాతరలో సిగ్నల్స్ లేక అవస్థలు తప్పడం లేదు. జాతర మొదలుకాక ముందే సిగ్నల్ అందక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మొబైల్ సిగ్నల్‌పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఫోన్లు కలవకపోవడం లేదని, ఇంటర్నెట్ పనిచేయడం లేదని వాపోతున్నారు. మరి కొద్ది రోజుల్లో జాతర ఉండగా ఇప్పుడే సిగ్నల్ కష్టాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News February 8, 2026
అరటిలో దుంపకుళ్లు తెగులు నివారణ ఎలా?

అరటి పంటలో దుంపకుళ్లు తెగులును నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఆశిస్తే తోటలకు సరిపడా నీరివ్వాలి. తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహా తీసేసి తోట బయట చిన్న చిన్న ముక్కలుగా చేసి తగలబెట్టాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టి బాగా తడిచేలా 25 గ్రాముల బ్లీచింగ్ పౌడర్‌ను లీటరు నీటికి కలిపి తడపాలి. పశువుల ఎరువుతో వృద్ధి చేసిన సూడోమోనాస్‌ను మొక్కల మొదళ్ల దగ్గర వేస్తే తెగులు చాలా వరకు తగ్గుతుంది.
News February 8, 2026
APPLY NOW: HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 39 పోస్టులు

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 39 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BSc, BTech, CA, MSc, MBA/PGDM, MCA, MHA, MPH, BPMT, PGDMLT, MLT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.20,000-రూ.2,20,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com
News February 8, 2026
మమ్ముట్టి పేరు వెనుక ఆసక్తికర కథ

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. కాలేజీ రోజుల్లో తన పేరు పాతగా అనిపించడంతో ‘ఒమర్ షరీఫ్’గా పరిచయం చేసుకునేవారు. అయితే ఒకసారి పాకెట్ నుంచి ఐడీ కార్డు పడిపోవడంతో ఓ స్నేహితుడు మహ్మద్ కుట్టిని ‘మమ్ముట్టి’గా పిలిచాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా ఆ పేరుతోనే పిలిచేవారు. అదే చివరికి స్క్రీన్ నేమ్‌గా మారింది. తాజాగా ఆయన పద్మభూషణ్ అందుకున్నారు.


