News January 11, 2026
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ ఈ బయ్యారంలో హోరాహోరీగా కబడ్డీ పోటీలు
✓ రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు అశ్వాపురం విద్యార్థి ఎంపిక
✓ ప్రశాంతంగా టెట్ పరీక్షలు: భద్రాద్రి కలెక్టర్
✓ అశ్వాపురం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
✓ రేపు ఆళ్లపల్లి, గుండాల మండలంలో పవర్ కట్
✓ పాల్వంచ పెద్దమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యం: సీపీఐ
✓ రేపు కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి పర్యటన
Similar News
News February 16, 2026
బిల్ గేట్స్ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న కలెక్టర్

అమరావతి సచివాలయంలో రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో కలిసి బిల్ గేట్స్ బృందంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అనంతపురం కలెక్టరేట్ ఎన్ఐసీ భవనం నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వర్చువల్ విధానంలో ఈ భేటీకి హాజరయ్యారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పాలనలో సాంకేతికతను జోడించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు ఈ సమావేశం దిశానిర్దేశం చేసింది.
News February 16, 2026
అస్సాం, WB ఎన్నికలపై బంగ్లా పరిణామాల ప్రభావం

దేశ సరిహద్దులోని బంగ్లా ఎన్నికల ప్రభావం అస్సాం, WB అసెంబ్లీ ఎలక్షన్లపై ఏమేరకు ఉంటుందన్నది చర్చగా మారింది. మొత్తం జనాభాలో ముస్లింలు అస్సాంలో 40%, WBలో 30% ఉన్నారు. వీరిలో అక్రమ వలసదారులే అధికం. బంగ్లాలో ఏ పరిణామం చోటుచేసుకున్నా ఆ ప్రభావం ఈ రాష్ట్రాలపై పడుతోంది. బంగ్లా హిందువులపై దాడులను BJP 2 రాష్ట్రాల్లో ప్రచారాస్త్రంగా చేసుకుంది. అయితే అక్కడ BNP అధికారంలోకి రావడంతో మార్పు ఉంటుందేమో చూడాలి.
News February 16, 2026
సంచలనం.. ఒకే ఫార్మాట్లో 700 వికెట్లు

అఫ్గానిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ T20 క్రికెట్‌లో సంచలనం నమోదు చేశారు. T20WCలో భాగంగా ఇవాళ UAE బ్యాటర్ అర్ఫాన్‌ను ఔట్ చేయడంతో ఈ ఫార్మాట్‌లో 700 వికెట్లు తీసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. అన్ని లీగ్స్‌లో కలిపి ఈ ఘనత సాధించారు. అఫ్గాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 191వ వికెట్. కాగా ఓవరాల్ వికెట్ల జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో బ్రావో(వెస్టిండీస్-631), నరైన్(వెస్టిండీస్-613*) ఉన్నారు.


