News January 11, 2026

శ్రీకాకుళం: మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం

image

శ్రీకాకుళం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గుండ అప్పల సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆయనను ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. కుటుంబ సభ్యులు వైద్యుల నుంచి అతని ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి బులిటెన్ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 29, 2026

శ్రీకాకుళం జిల్లా కోర్టులో రూ.23వేలతో ఉద్యోగాలు

image

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA)లో ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కో-ఆర్డినేటర్, రికార్డు అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు గడువును 30వతేదీకి అధికారులు పొడిగించారు. పోస్టుల వారీగా రూ.23,120-రూ.89,720ల వేతనమిస్తారు. శ్రీకాకుళం జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు పత్రాని డౌన్‌లోడ్ చేసి నింపి పోస్ట్‌లో DLSA SKLM అడ్రస్‌కు పంపాలని DLSA కార్యదర్శి హరిబాబు ఓ ప్రకటనలో చెప్పారు.

News January 29, 2026

శ్రీకాకుళం జిల్లాలో 10 బార్లకు నోటిఫికేషన్..కేటాయించిన ప్రాంతాలివే

image

శ్రీకాకుళం జిల్లాలోని 10 బార్ లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎక్సైజ్ జిల్లా శాఖ సూపరింటెండెంట్ తిరుపతిరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 28వ తేదీ నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 5 షాపులు, పలాసలో 2 ఇచ్ఛాపురంలో 2, ఆముదాలవలసలో ఒక బార్ షాప్ ఏర్పాటు చేసేందుకు ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు.

News January 29, 2026

ఆదిత్యుని సేవలో సినీ నటులు

image

ప్రత్యక్షదైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని బుధవారం టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుజాత, సనా దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.