News January 12, 2026
ఫ్లెమింగో ఫెస్ట్: ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా.!

ఫ్లెమింగో ఫెస్టివల్‌లో రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. హీరోయిన్‌లు ఆషికా, డింపుల్ అందాలు, హెబ్బా డాన్స్ ఫర్మామెన్స్ అదిరిపోయింది. సింగర్ హారిక పాటలకు ప్రేక్షకులు తెగ సందడి చేశారు. జదర్దస్త్ కమెడీయన్‌లు రాకేష్ దంపతులు, చంటి అలరించారు. మొత్తంగా రెండో రోజు కార్యక్రమాలు ‘ఈమాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా’ అన్నట్లు సాగాయి. మీరూ ఈవెంట్‌కు వెళ్లింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 13, 2026
నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.
News February 13, 2026
నెల్లూరు జిల్లాలో ఆ సర్పంచ్ తొలగింపు

పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరిపై గతంలోనే సస్పెన్షన్ వేటుపడింది. తాజాగా గురువారం ఆమెను శాశ్వతంగా తొలగిస్తూ నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ అధికార దుర్వినియోగంతో తన భర్త వెంకటశేషయ్య అకౌంట్‌లోకి అక్రమంగా నగదు తరలింపు, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 13, 2026
నెల్లూరు: రైతు మెడకు ఉరితాడు..!

అకాల వర్షాలు, కరవు, పెరిగిన సాగు ఖర్చులు, అధిక వడ్డీల భారం రైతు మెడకు ఉరితాడుగా మారుతున్నాయి. జిల్లాలో 2021(2), 2022(6), 2023(1), 2024(3), 2025(3) చొప్పున 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 8 మందికి రూ.7లక్షలు చొప్పున రూ.56 లక్షలు పరిహారం అందగా, 3 దరఖాస్తులు రిజెక్ట్ చేయగా, 3 ప్రతిపాదనలు పంపగా.. ఒకరిది అగ్రికల్చర్ లాగిన్లోకి రాలేదు. ప్రభుత్వాలు పంటకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


