News January 12, 2026

విజయవాడలో అర్ధరాత్రి హత్య (అప్డేట్)

image

విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో ఆదివారం రాత్రి అత్తను అల్లుడు హత్య చేసిన విషయం తెలిసిందే. అత్తపై ఉన్న ఆగ్రహంతో అల్లుడు దారుణంగా హత్య చేశాడు. అల్లుడు నాగసాయి కత్తితో అత్త దుర్గాను విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని అజిత్ సింగ్ నగర్ పోలీసులు తెలిపారు.

Similar News

News February 19, 2026

ఈనెల 20న గద్వాలలో జాబ్ మేళా..!

image

గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ, ఉపాధి కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. శ్రీ చరణ్ దీప్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని ఎఫ్ 30/1 లో ఉదయం 11:00 గంటలకు జరిగే జాబ్ మేళాకు 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండి ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ చదివిన వారు హాజరు కావాలన్నారు.

News February 19, 2026

HYD: TG FSLలో జాబ్స్.. పరీక్షల తేదీలివే..!

image

TG ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి రాత పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. మార్చి 5, 6, 7 తేదీలలో మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

News February 19, 2026

మామిడి కాయలకు ‘ఫ్రూట్ కవర్స్’తో లాభం

image

వాతావరణ పరిస్థితులు, పురుగులు, పండు ఈగ, ఇతర కీటకాల వల్ల మామిడి పంటకు నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మ లేదా కోడి గుడ్డు సైజుకు మామిడి కాయ వచ్చాక ‘ఫ్రూట్ కవర్స్’ కట్టాలి. దీని వల్ల చెట్టుపై రసాయనాలు పిచికారీ చేసినా అవి పండుపై పడవు. అలాగే కవర్ కట్టిన కాయపై ఎలాంటి మచ్చలు, చీడపీడల లక్షణాలు కనిపించవు. ఇతర కాయల కంటే ఎక్కువ బరువు పెరిగి మంచి ధర పలుకుతాయి. ఈ కవర్స్ వాటర్ ప్రూఫ్. నీరు పడినా ఏమీ కావు.