News January 12, 2026
బాపట్ల: సంక్రాంతికి ఊర్లు వెళ్తున్నారా.. జాగ్రత్త

సంక్రాంతి పండగ వేళ ఇతర గ్రామాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని బాపట్ల జిల్లా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. సెలవులకు వెళ్లే వారు సోషల్ మీడియాలో ఎలాంటి సమాచారం వెల్లడించరాదన్నారు. దొంగలు ఇదే అదునుగా తీసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇళ్లకు తాళాలు వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర వేళల్లో 100 కు డైల్ చేయాలని సూచించారు.
Similar News
News February 7, 2026
పార్వతీపురం: అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి

పార్వతీపురం జిల్లాలో అనారోగ్యంతో మరో విద్యార్థి మృతి చెందింది. గుమ్మలక్ష్మీపురం(M) రేగిడి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రూపావతి ఇటీవల అనారోగ్యానికి గురైంది. పాఠశాల సిబ్బంది రేగిడి PHCలో చికిత్స చేసి అనంతరం కురుపాం CHCకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం KGHలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. 2025లో కూడా పలువురు విద్యార్థులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.
News February 7, 2026
తిప్పర్తి: ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి

ట్రాక్టర్‌పై నుంచి పడి చిన్నారి మృతి చెందిన విషాద ఘటన తిప్పర్తి మండలం వెంకటాద్రిపాలెంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు.. కొల్లు సైదులు అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శనివారం సైదులు యూరియా బస్తాల కోసం వెళ్తుండగా పెద్ద కూతురు మనస్విని(2) వెంట వస్తానని మారం చేయగా తీసుకెళ్లాడు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుండగా సీట్లో కూర్చున్న పాపం జారిపడటంతో తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందిది.
News February 7, 2026
పోర్న్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాడు.. వీడియో చూసి షాక్ తిన్నాడు..

పోర్న్ చూడ్డానికి ఓ వెబ్‌సైట్‌కు వెళ్లిన ఎరిక్ అనే వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ప్లే అవుతున్న వీడియోలో ఉన్నది తానే అని గుర్తించి కంగుతిన్నారు. హాంకాంగ్‌కు చెందిన ఆయన ఓసారి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చైనాలోని హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆమెతో సన్నిహితంగా గడిపారు. దీన్ని హోటల్ సిబ్బంది స్పై కెమెరా ద్వారా రికార్డు చేసి సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఇలా పదేళ్లుగా జరుగుతున్నట్టు ఎరిక్ తర్వాత గుర్తించారు.


