News January 12, 2026
కామారెడ్డిలో 2k రన్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో వివేకానంద జయంతి పురస్కరించుకొని సోమవారం 2k రన్ నిర్వహించనున్నట్లు కీడాభారతి జిల్లా అధ్యక్షుడు మారుతి తెలిపారు. సర్దార్ పటేల్ విగ్రహం నుంచి సరస్వతి విద్యా మందిర్ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News January 18, 2026
మేడారం భద్రతపై డీజీపీ సమీక్ష

మేడారం మహా జాతర భద్రతా ఏర్పాట్లపై DGP శివధర్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన ఆయన, డ్రోన్ టెక్నాలజీ, రియల్ టైమ్ మ్యాప్స్ పనితీరును పరిశీలించారు. ములుగు ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ జాతర బందోబస్తు ప్రణాళికను DGPకి వివరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని, గూగుల్ మ్యాప్స్ సాయంతో రద్దీని పర్యవేక్షించాలని DGP ఆదేశించారు.
News January 18, 2026
‘నారీ నారీ నడుమ మురారి’ కలెక్షన్లు ఎంతంటే?

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదలైన మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8.90 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ఆఖరి సినిమాగా విడుదలై హిట్ టాక్ వచ్చినా థియేటర్ల కొరత ఉండటం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. రేపటి నుంచి థియేటర్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం. మీరు ఈ మూవీ చూశారా?
News January 18, 2026
తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


