News January 12, 2026

కృష్ణా: తల్లి గల్ఫ్‌లో.. కన్నబిడ్డపై కన్నేసిన తండ్రి!

image

కన్న కూతురిపై తండ్రి అసభ్యంగా ప్రవర్తించిన అమానుష ఘటన కృత్తివెన్నులో చోటుచేసుకుంది. తల్లి గల్ఫ్‌లో ఉండటంతో, 14 ఏళ్ల బాలిక ప. గో (D) మొగల్తూరులోని అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. అక్కడ తండ్రి వేధింపులకు పాల్పడటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మొగల్తూరు పోలీసులు జీరో FIR నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం కేసును కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Similar News

News February 5, 2026

అనకాపల్లి జిల్లాలో 2 మద్యం బార్లకు లైసెన్స్ మంజూరు

image

అనకాపల్లి జిల్లా పరిధిలోని నోటిఫైడ్ బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు డీఆర్వో వై. సత్యనారాయణ తెలిపారు. 10 దరఖాస్తులకు డ్రా నిర్వహించగా ఇద్దరికీ లాటరీ తగిలినట్లు తెలిపారు. డ్రాలో ఎంపికైన అభ్యర్ధులు పూర్తి స్థాయి ఫీజును వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుందన్నారు.

News February 5, 2026

సిద్దిపేట: మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్‌ల నియామకం

image

సిద్దిపేట జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కూన శ్రీశైలం గౌడ్, దుబ్బాక మున్సిపల్- వనం శ్రీనివాస్, చేర్యాల మునిసిపాలిటీ-మెట్టు సాయి కుమార్, హుస్నాబాద్ మున్సిపాలిటీ- జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌లను నియమించారు.

News February 5, 2026

మున్సి‘పోల్స్’లో సోషల్ మీడియా వార్

image

TG: మున్సి‘పోల్స్’ ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా మార్మోగుతున్నాయి. నేతల ఇంటింటి ప్రచారాలతో పాటు పార్టీలు SMనూ ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల బాధ్యతలను INC మంత్రులకు, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించాయి. వీరి వ్యూహాల ప్రకారమే నడవాలని శ్రేణులకు సూచించాయి.