News January 12, 2026

ఎగ్ ఫ్రీజింగ్ ఎలా చేస్తారంటే?

image

ఎగ్‌ఫ్రీజింగ్‌ని అండాశయ క్రయోప్రిజర్వేషన్ అని కూడా అంటారు. కెరీర్ లేదా ఇతర కారణాల వల్ల లేటుగా పిల్లల్ని కనాలనుకొనే మహిళలకు ఎగ్ ఫ్రీజింగ్ సజ్జెస్ట్ చేస్తారు. మహిళల అండాలను సేకరించి చాలా కాలం పాటు ఫ్రీజ్ చేస్తారు. 37 సంవత్సరాల లోపు ఉన్నవారు ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికోసం అండాశయం నుంచి అండాలను ఉత్పత్తి చేయడానికి హార్మోన్ల ఇంజెక్షన్లు ఇస్తారు. తర్వాత వాటిని భద్రపరుస్తారు.

Similar News

News February 9, 2026

వివాదాస్పద బుక్.. లీకేజీపై దర్యాప్తు

image

లోక్‌సభలో <<19052501>>ప్రకంపనలు<<>> రేపిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణె ఆత్మకథ పుస్తకం ఎలా లీకైందనేదానిపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. FIR నమోదు చేసి PDF కాపీ ఎలా బయటికి వచ్చిందని ఆరా తీస్తున్నారు. చైనాతో ఉద్రిక్తతలకు సంబంధించి నిజాలు ఇందులో రాశారని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ పుస్తకం ఎప్పటికీ పబ్లిష్ కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నారు. కేంద్ర ఆమోదం లభించకపోవడంతో ఈ పుస్తకం పబ్లిషింగ్ నిలిచిపోయింది.

News February 9, 2026

పాపం.. ఇషాన్ కిషన్‌!

image

దేశవాళీ ప్రదర్శనతో T20 WC జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్‌పై BCCI దయ చూపలేదు. తాజాగా రిలీజ్ చేసిన <<19095739>>సెంట్రల్ కాంట్రాక్ట్<<>> లిస్టులో అతనికి చోటు కల్పించలేదు. దీంతో కిషన్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రంజీల్లో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేశారని 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇతనితో పాటు శ్రేయస్‌‌ను BCCI తొలగించింది. అయితే తాజా లిస్టులో అయ్యర్ గ్రేడ్-Bలో ఉన్నారు.

News February 9, 2026

ఫలితాలకు ముందే సీఎం ఓటమిని ఒప్పుకున్నారు: బండి

image

TG: సీఎం <<19093271>>రేవంత్<<>> మున్సిపల్ ఫలితాలకు ముందే ఓటమిని ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆ భయంతోనే బీజేపీపై అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సీఎం స్క్రిప్ట్ దారుస్సలాంలో ప్రిపేర్ అవుతోందని విమర్శించారు. చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టడం సీఎంకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము తనకు లేదని రేవంత్ లేఖ రాస్తే వాళ్ల సంగతి తాము చూసుకుంటామన్నారు.