News January 12, 2026

గద్వాల్: నేడు పలు మండలాల్లో సీఎం కప్ టార్చ్ ర్యాలీ

image

గ్రామీణ క్రీడాకారులను ప్రపంచస్థాయి విజేతలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. గద్వాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి నేడు గద్వాల ఇండోర్ స్టేడియం నుంచి టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కృష్ణయ్య ప్రకటనలో పేర్కొన్నారు. ధరూర్, కేటి దొడ్డి, గట్టు, మల్దకల్, ఐజ, వడ్డేపల్లి, రాజోలి మండలాల్లో టార్చ్ ర్యాలీ ఉంటుందన్నారు.

Similar News

News January 25, 2026

మంచిర్యాల: 8 మంది మావోయిస్టుల లొంగుబాటు

image

మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. శనివారం సీపీ కార్యాలయంలో మలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగాలకు చెందిన ఎనిమిది మంది మావోయిస్టులు ఎదుట లొంగిపోయారు. సీపీ మాట్లాడుతూ.. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందించే పునరావాస పథకాలను వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

News January 25, 2026

అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో బాధిత కుటుంబాలైన ఏడుగురికి పీవోఏ యాక్ట్ కింద ఐటీఐ, అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వెల్లడించారు. శనివారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో వారికి నియామక పత్రాలను అందజేశారు. ఉద్యోగాలు పొందిన వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

News January 25, 2026

KNR: పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలి.. ఆదమరిస్తే అంతే!

image

ఉమ్మడి KNR జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి, మానేరు నది తీరాన పురాతన శిథిలావస్థలోని ఆలయాలు, రామగిరి ఖిల్లా, ధూళికట్ట బౌద్ధక్షేత్రంతో పాటు జలాశయాలను మరింత సుందరంగా తీర్చిదిద్దేలా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ ప్రాంతంలోని పురాతన దేవాలయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి.