News January 12, 2026
INDvsNZ.. తొలి వన్డేలో నమోదైన రికార్డులు

⋆ వన్డేల్లో భారత్ 300+ టార్గెట్ ఛేజ్ చేయడం ఇది 20వ సారి. ఈ లిస్టులో భారత్‌దే టాప్ ప్లేస్
⋆ అత్యధిక సార్లు(5) వన్డేల్లో వరుసగా 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌లలో 50+ స్కోర్ చేసిన ఆటగాడిగా కోహ్లీ
⋆ 2025CT తర్వాత వన్డేల్లో NZకి ఇదే తొలి ఓటమి
⋆ 2023 నుంచి వన్డేల్లో NZపై భారత్‌కు వరుసగా ఇది ఎనిమిదో విక్టరీ
⋆ NZపై IND ఛేజ్ చేసిన రెండో హైయెస్ట్ స్కోర్(301) ఇదే
Similar News
News February 21, 2026
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ఇంటర్ బోర్డు

AP: ఈ నెల 23 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఉ.9 గంటలకు పరీక్షలు ప్రారంభం కానుండగా, నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఎగ్జామ్ హాలులోకి అనుమతించబోమని పేర్కొంది. ఫస్ట్, సెకండియర్ కలిపి 10,57,312 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు.
News February 21, 2026
మెటర్నిటీ లీవ్ గురించి తెలుసా?

మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం, పని చేసే మహిళలకు గర్భం దాల్చిన సమయంలో ప్రత్యేకహక్కులు ఉన్నాయి. మొదటి ఇద్దరు పిల్లలకు 26 వారాల పెయిడ్ లీవ్స్ అందించాలి. తదుపరి పిల్లలకు 12 వారాల పెయిడ్ లీవ్స్ ఇవ్వాలి. మూడు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు లేదా సరోగసీ పేరెంట్స్ కూడా 12 వారాల సెలవు పొందవచ్చు. ఈ లీవ్స్ తీసుకున్నందుకు కంపెనీలు మహిళలను ఉద్యోగం నుంచి తొలగించలేవు.
News February 21, 2026
గ్రాండ్ నైన్(జీ9) కంటే కావేరీ వామన్ ఎందుకు ప్రత్యేకం?

దేశంలో ప్రస్తుతం గ్రాండ్ నైన్(G9) అరటి ఎక్కువగా సాగులో ఉంది. ఈ చెట్టు ఎత్తు 6–8 అడుగులు. పంట కాలం 11–12 నెలలు. దీని ఎత్తు ఎక్కువ కావడం వల్ల తీవ్ర గాలులకు ఒరిగి/విరిగి రైతులు నష్టపోతున్నారు. దీనికి ఊత కర్రలను సైతం అమర్చుకోవడానికి అదనపు ఖర్చవుతోంది. కావేరి వామన్ రకం 4.9-5.25 అడుగులే ఉండటం వల్ల గాలులను తట్టుకుంటుంది. ఊత కర్రల అవసరం ఉండదు. ఈ చెట్ల గెలలు G9 కంటే నెల ముందే కోతకు రావడం అదనపు లాభం.


