News January 12, 2026

వచ్చే నెలలోనే పరిషత్ ఎన్నికలు?

image

TG: మునిసిపల్ ఎన్నికలవగానే FEB చివరి వారం లేదా MAR తొలి వారంలో పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. పరిషత్‌లకు ₹550Cr పెండింగ్ నిధులు రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి నెల రోజుల ముందే ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Similar News

News February 18, 2026

ఏప్రిల్ 19 నుంచి చార్‌ధామ్ యాత్ర.. రిజిస్ట్రేషన్‌కు ఫీజు!

image

పవిత్ర చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది రిజిస్ట్రేషన్‌కు మినిమమ్ ఫీజు వసూలు చేయనున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లను నిరోధించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఫీజు ఎంతనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి, 22న కేదార్‌నాథ్, 23న బద్రీనాథ్ తెరుచుకోనున్నాయి.

News February 18, 2026

వంగలో ఆకుమాడు తెగులు – నివారణ

image

వంగ పంటలో నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఆకుమాడు తెగులు ఆశిస్తుంది. దీని వల్ల ఆకులు మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. అలాగే గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి, వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో దీని వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుమాడు తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.

News February 18, 2026

T20 WC: పాక్ ఓడితే ఇంటికే!

image

T20 WCలో భాగంగా ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11AMకు సౌతాఫ్రికా-UAE, 3PMకు పాకిస్థాన్-నమీబియా, 7PMకు ఇండియా- నెదర్లాండ్స్ తలపడనున్నాయి. నేటి మ్యాచ్‌లో పాక్ గెలిస్తే S-8కు అర్హత సాధించనుంది. ఓడితే మాత్రం రన్ రేట్ ఆధారంగా USAకు అవకాశం దక్కనుంది. ఇక ఇప్పటికే ఇండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఇంగ్లండ్, జింబాబ్వే S-8కు వెళ్లాయి.