News January 12, 2026

లింగంపల్లి శివారులో కారును ఢీకొన్న కంటైనర్

image

మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వచ్చిన కంటైనర్, ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 20, 2026

అనకాపల్లి: దొంగతనం నెపం.. మనస్తాపంతో 10th విద్యార్థి అత్మహత్య

image

బుచ్చయ్యపేట(M) కొత్త కొండెం పూడిలో పదో తరగతి విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు కొంతమంది వెండి పట్టీలు దొంగతనం చేశారని నెపం మోపడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృదేహాన్ని చూసి తల్లిదండ్రులు తలారి మంగపతి, భవాని కన్నీరు మున్నీరయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుచ్చయ్యపేట ఎస్సై ఏ.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

News February 20, 2026

పాలమూరు: Phone Payలో లంచం.. అధికారుల సస్పెండ్

image

ఫోన్ పే ద్వారా లంచాలు వసూలు చేస్తున్న 8 మంది ఉద్యోగులను TGSPDCL సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా గద్వాల్ జిల్లా ఏఈ సుబ్బారాయుడు రూ.25,000, అలంపూర్‌ ఆపరేషన్స్ లైన్‌మెన్ షావలి రూ.2,500 అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు అంతర్గత విచారణలో నిరూపితమైంది. విజిలెన్స్ విభాగం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో డిజిటల్ ఆధారాలు లభ్యం కావడంతో వీరిపై వేటు పడింది.

News February 20, 2026

నంద్యాల: గుండెపోటుతో కోవా బన్ను వ్యాపారి మృతి

image

నంద్యాల(D) ఆత్మకూరుకు చెందిన కోవా బన్ను వ్యాపారి షేక్ బాషా నిన్న గుండెపోటుతో మృతిచెందారు. మేడారం జాతర సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ చూపిన అత్యుత్సాహంతో అతని వ్యాపారం పడిపోయింది. ఈ వ్యాపారం కోసం ప్రత్యేకంగా గేదెలు, ఆటో కొనుగోలు చేయడంతో పాటు సుహానా-సమయ మిల్క్ డెయిరీ పేరుతో పాల ఉత్పత్తి చేసేవారు. వ్యాపారం ఆగిపోవడంతో అప్పులు తీర్చేమార్గం లేక వేదనకు గురై గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.