News January 12, 2026
నిజామాబాద్: సన్మానాలేనా సమస్యలు తీర్చేదేమైనా ఉందా?

ఇటీవల ఎన్నికైన సర్పంచులు సన్మానాలు, సత్కారాలతో బిజీగా ఉన్నారు. వివధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు సర్పంచులను సన్మానాలు చేస్తున్నాయి. అయితే సర్పంచులుగా ఎన్నికై దాదాపు నెలరోజులైనా గ్రామాల్లోని సమస్యలపై కాకుండా సన్మానాలపై ఫోకస్ పెట్టినట్లు పలువురు విమర్శిస్తున్నారు. సన్మానాలేనా సమస్యలు తీర్చేదేమైనా ఉందా అని అడుగుతున్నారు.
Similar News
News January 22, 2026
పరిశ్రమలకు వసతులు కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు మౌలిక వసతులను త్వరితగతన కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. ఇటీవల విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో 14 మంది పారిశ్రామికవేత్తలు నెల్లూరులో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నారని చెప్పారు. వారికి అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు.
News January 22, 2026
PM తర్వాత గంభీర్‌దే టఫ్ జాబ్: శశి థరూర్

నాగ్‌పూర్‌లో హెడ్ కోచ్ గంభీర్‌ను కలిసినట్లు MP శశి థరూర్ పేర్కొన్నారు. ‘నా ఓల్డ్ ఫ్రెండ్‌తో మంచి డిస్కషన్ చేశాను దేశంలో PM తర్వాత గంభీర్ అత్యంత కష్టమైన ఉద్యోగం చేస్తున్నారు. రోజూ లక్షలమంది విమర్శిస్తున్నా ధైర్యంగా నడుస్తున్నారు. ఆయనకు అన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. గంభీర్ ఆయనకు థాంక్స్ చెప్పారు. పరిస్థితులు చక్కబడితే కోచ్ బాధ్యతలపై క్లారిటీ వస్తుందని ట్వీట్ చేశారు.
News January 22, 2026
మార్చి 29న సూపర్ వైజర్ పోస్టులకు రాత పరీక్ష

తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి మార్చి 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు TSLPRB ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తుల గడువు ముగియగా, పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. అభ్యర్థులు అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.


