News January 12, 2026
అక్షర యోధుడు అలిశెట్టి

కవిత్వంతో ప్రజల్లో ఆలోచనాదృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతికొద్ది మంది కవుల్లో అలిశెట్టి ప్రభాకర్ ఒకరు. చిత్రకారుడిగా, ఫొటో గ్రాఫర్‌గా పని చేస్తూనే కవిగా ఎదిగారు. సామాజిక చైతన్యమే ధ్యేయంగా కవిత్వాలు రాశారు. ‘ఎర్ర పావురాలు’, ‘మరణం నా చివరి చరణం కాదు’, ‘సిటీలైఫ్’ వంటి కవితా సంకలనాలు రచించారు. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీ సృష్టించుకున్నారు. నేడు ఆయన జయంతి, వర్ధంతి(1956-1993).
Similar News
News February 21, 2026
వసూల్ రాజా.. సుంకాలతో USకు భారీగా ఆదాయం

అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధిస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు, ఫీజుల ద్వారా 2025లో USకు ఏకంగా రూ.26 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 2024తో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. అయితే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ అంతిమంగా ఆ దేశ ప్రజలపైనే పడుతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్స్ విధించడం వల్ల స్థానికంగా వాటి ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతోంది.
News February 21, 2026
ఏఐ మాయ.. ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ జాబ్స్ పోతాయనే ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు, రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధికి కోత పడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లలో 30 కోట్ల జాబ్స్ పోతాయని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేసింది. కానీ ఆ సంఖ్య 80 కోట్లకు పైనే అని కన్సల్టింగ్ సర్వీసుల కంపెనీ మెక్‌కిస్నీ చెప్పింది.
News February 21, 2026
T20 WC: సూపర్-8 ఫైట్ జరుగుతుందిలా..

లీగ్ దశ <<19197455>>ముగిసిన<<>> తర్వాత 2 గ్రూపుల్లో నాలుగేసి జట్లున్నాయి. ప్రతి గ్రూపులోని ఒక టీమ్ మిగిలిన మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అలా ఈ స్టేజీ ముగిసేలోపు 2 గ్రూపుల్లో టాప్-2లో ఉండే 4 జట్లు సెమీస్ చేరుతాయి. భారత్.. SA, జింబాబ్వే, విండీస్‌తో ఆడనుంది. మరో గ్రూపులో న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరుతుంది. సూపర్-8 షెడ్యూల్ పైన ఇమేజ్‌లో చూడవచ్చు.


