News January 12, 2026

వరంగల్ MGMలో ఖమ్మం జిల్లా వ్యక్తి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన రవికుమార్(34) వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద శ్వాస ఇబ్బందితో కుప్పకూలారు. ఈనెల 9న జరిగిన ఈ ఘటనలో హోంగార్డ్ అమీన్ బాధితుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్ ఆదివారం రాత్రి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుని బంధువుల వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సమాచారం తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్సై తేజ కోరారు.

Similar News

News March 15, 2026

విద్యుత్‌ పునరుద్ధరణకు ‘ఎమర్జెన్సీ’ వాహనాలు: ఎస్ఈ

image

ఖమ్మం: ప్రకృతి విపత్తులు, సాంకేతిక కారణాల వల్ల కలిగే విద్యుత్ అంతరాయాలను వేగంగా పునరుద్ధరించేందుకు జిల్లాలో 5 ‘ఎమర్జెన్సీ రీస్టోరేషన్ టీమ్’ వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. వీటితో పాటు సబ్ డివిజన్ స్థాయిలో 13 వాహనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. GPRS సౌకర్యం ఉన్న ఈ వాహనాల్లో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదుల కోసం 1912 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.

News March 15, 2026

BREAKING: ఖమ్మం: విద్యుత్ షాక్‌తో పంచాయతీ సెక్రటరీ మృతి

image

కరెంటు షాక్ తగిలి పంచాయతీ కార్యదర్శి మృతి చెందిన విషాద ఘటన ఉదయం కారేపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట కార్యదర్శిగా పనిచేస్తున్న సురేష్ కారేపల్లిలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆయన స్వగ్రామంతో పాటు విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

News March 15, 2026

ఖమ్మం: యుద్ధ మేఘాలు.. వంట గదిలో మంట

image

అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు సామాన్యుడి వంట గదిపై పెనుభారం మోపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, దిగుమతులు తగ్గడంతో వంట నూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. నెల క్రితం రూ.155 ఉన్న సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 180కు, రూ. 110 ఉన్న పామాయిల్ రూ.135కు చేరింది. వేరుశనగ, కొబ్బరి నూనెల ధరలు కూడా భారీగా పెరగడంతో మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.