News April 25, 2024

ఫోన్ ట్యాపింగ్: పోలీసులకు జీవిత ఖైదు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన పోలీసులకు జీవిత ఖైదు పడే అవకాశం కనిపిస్తోంది. వారిపై సైబర్ టెర్రరిజం సెక్షన్ల కింద ఐటీ యాక్ట్ 66(ఎఫ్)ను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చట్టాన్ని జోడిస్తూ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. నేర నిరూపణ జరిగితే నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఐటీ యాక్ట్-70 కింద కేసు నమోదు చేశారు. ఈ యాక్ట్‌ ప్రకారం పదేళ్ల జైలు శిక్ష పడుతుంది.

Similar News

News January 24, 2026

HYD: పిల్లల స్కూల్ ఫీజు 140% పెరిగింది సీఎం సార్!

image

సీఎం సార్.. మా పిల్లల ఫీజు ఏకంగా 140% పెరిగింది.. ఇపుడు మా పరిస్థితేంటి అని హైదరాబాద్‌లోని ఓ పబ్లిక్ స్కూల్ పేరెంట్స్ సీఎంకి లేఖ రాశారు. ఇంతగా పెంచేస్తే అంత డబ్బు మేమెక్కడినుంచి తీసుకురావాలి. మీరు ఈ సమస్యను పరిష్కరించండని లేఖలో కోరారు. క్లాస్-1 ఫీజు రూ.93 వేల నుంచి రూ.2లక్షలకు పెంచారని వాపోయారు. ఇలా అన్ని తరగతుల ఫీజులు పెరిగాయని పేర్కొన్నారు. కాగా, అంతగా పెంచలేదని ప్రిన్సిపల్ చెబుతున్నారు.

News January 24, 2026

TODAY HEADLINES

image

⋆ తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
⋆ ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: సీఎం చంద్రబాబు
⋆ ఫోన్ ట్యాపింగ్ కేసులో 7 గంటలకుపైగా కేటీఆర్ విచారణ
⋆ పూర్తిగా సహకరించా.. పోలీసులు నీళ్లు నమిలారు: KTR
⋆ తిరుమల కల్తీనెయ్యి కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్.. మరో 12 మందిని నిందితులుగా చేర్చిన CBI
⋆ రెండో టీ20లో NZపై భారత్ విజయం
⋆ WHO నుంచి వైదొలగిన అమెరికా

News January 24, 2026

ఎయిర్‌పోర్ట్‌లో అస్థిపంజరం కలకలం

image

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మానవ అస్థిపంజరం కనిపించడంతో సిబ్బంది షాక్‌కు గురయ్యారు. టెర్మినల్‌-3లో లగేజీ తనిఖీ చేస్తున్న సమయంలో ఓ బ్యాగ్‌లో కనిపించింది. వెంటనే పోలీసులు, ఎయిర్‌పోర్ట్‌ భద్రతా బృందాలు అప్రమత్తమయ్యారు. అయితే అది మెడికల్‌ విద్యార్థులు ఉపయోగించే డెమో స్కెలిటన్‌గా గుర్తించారు. ఆ బ్యాగ్‌ వైద్య విద్యార్థిది అని తేల్చారు. అయినప్పటికీ దానిని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు.