News January 12, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రారంభమైన PGRS

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కార దిశగా సంబంధిత అధికారులకు ఫిర్యాదులపై బాధితుల ముందే పరిష్కరిస్తున్నారు. మండల స్థాయిలోనే ఫిర్యాదులు పరిష్కారం అవ్వాలని ఆదేశించారు. డీఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ పాల్గొని ఫిర్యాదులను స్వీకరించారు.
Similar News
News February 14, 2026
చిత్తూరు: 18 సమస్యలకు పరిష్కారం

జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి, సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్లలో 72 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లలో 22,LT లైన్లలో 163, సర్వీసులైన్‌లో 15 కలిపి మొత్తం 272 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 18 సమస్యలను పరిష్కారించామన్నారు.
News February 14, 2026
చిత్తూరు: విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. PD సస్పెండ్

పెనుమూరు ZP ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 మే నెలలో పాఠశాలలోని విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై HRDలో విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిని విచారించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి చిత్తూరు డీఈవోకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో చిత్తూరు డీవైఈవో ఇందిర నివేదిక మేరకు ఆయన్ను సస్పెండ్ చేశారు.
News February 14, 2026
కుప్పం DSP పై శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

కుప్పం DSP పై MLC భరత్ శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కుప్పం నియోజకవర్గంలో అత్యవసర ప్రజా ఫిర్యాదులు, శాంతిభద్రతల సమస్యలను చర్చించేందుకు DSPకి ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని, ప్రోటోకాల్‌కు సంబంధించి ప్రభుత్వ స్టాండింగ్ ఆర్డర్‌లను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తుకు ప్రివిలేజ్ కమిటీని పంపాలని, కుప్పం DSP పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


