News January 12, 2026
అనిల్ రావిపూడి రికార్డ్.. రాజమౌళి తర్వాత

డైరెక్టర్ అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం <<18832382>>పాజిటివ్<<>> టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా నిలిచారు. ‘పటాస్(2015)’ నుంచి ఇవాళ రిలీజైన ‘MSVPG’ వరకు మొత్తం 9 సినిమాల్లోనూ హిట్ కొట్టిన దర్శకుడిగా పేరొందారు. నాగార్జునతోనూ మూవీ చేస్తే నలుగురు సీనియర్ హీరోలతో పని చేసిన యువ దర్శకుడిగా మరో ఘనత సాధిస్తారు.
Similar News
News February 10, 2026
దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్‌గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.
News February 10, 2026
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్‌లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్‌సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్‌ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్‌లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.
News February 10, 2026
రంజాన్ మాసం.. ముస్లిం ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉపవాసాల నేపథ్యంలో ఒక గంట ముందే ఇంటికి వెళ్లేందుకు అనుమతించింది. ఈనెల 18 నుంచి మార్చి 19 వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ ఉద్యోగులు డ్యూటీ నుంచి ఒక గంట ముందే ఇంటికి వెళ్లొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.


