News January 12, 2026
హార్సిలీహిల్స్‌లో లోయలో పడిన యువకుడు

హార్సిలీహిల్స్‌లో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. పలమనేరుకు చెందిన పురుషోత్తం తిరుపతి SVUలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో కలిసి హార్సిలీహిల్స్‌కు వచ్చాడు. గాలిబండ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా కాలు జారి లోయలో పడిపోయాడు. దట్టమైన పొగ మంచు కారణంగా చాలాసేపటి తర్వాత చెట్ల మధ్యలో అతడిని గుర్తించారు. బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 25, 2026
ఓటు ప్రజల వజ్రాయుధం: కలెక్టర్

ఎనిమిది పదుల వయసులోనూ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న రామకృష్ణారావు, సత్యనారాయణమూర్తి, కృష్ణంరాజు, శ్రీమన్నారాయణలను ఆదివారం ఏలూరులో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ ఘనంగా సత్కరించారు. ఓటు ప్రజాస్వామ్య వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
News January 25, 2026
వనపర్తి: గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి కలెక్టరేట్‌ను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సోమవారం ఉదయం 8:30కు కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, 8 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీత రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం 9 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ప్రధాన వేడుకలు జరగనున్నాయి.
News January 25, 2026
VZM: ఇరువురి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

రామభద్రపురం మండల పరిధి పాతరేగ గ్రామంలో ఇరువురు మధ్య జరిగిన చిన్న గొడవలో ఘర్షణ జరిగి ఒకరినొకరు కొట్టుకోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ ప్రసాదరావు వివరాల మేరకు.. యాసర్ల సింహాచలం (70) అదే గ్రామానికి చెందిన పెద్దింటి తిరుపతికి మధ్య పాతబాకీ డబ్బులు కోసం శనివారం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో తిరుపతి, సింహాచలాన్ని బలంగా తోసాడు.. అతడు కొళాయి దిమ్మపై పడడంతో మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు.


