News April 25, 2024
కాకినాడలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

స్నేహితులతో సరదాగా స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు కాలువలో పడి మునిగి
మృతి చెందిన ఘటన ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. అనపర్తి శ్రీను (25) కూలి పనులు చేస్తుంటాడు. కొవ్వూరు లాకులు వద్ద కాలువలో స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్లి మరణించాడు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 13, 2025
గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్లో DEAD BODY

గోకవరం ఆర్ & ఆర్ కాలనీ రోడ్డుపై మృతదేహం కలకలం రేపింది. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు గోకవరం PSకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2025
తూ.గో టీడీపీ అధ్యక్ష పదవికి బొడ్డు,యర్రా పేర్లు పరిశీలన..?

రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిని జిల్లా టీడీపీ అధ్యక్షునిగా నియమిస్తారనే గుసగుస వినిపిస్తోంది. జిల్లాలో కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆ వర్గానికి ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. మరో వైపు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సోదరుడి బావమరిది యర్రా వేణు గోపాల్ రాయుడు పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరిలో పదవి ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.
News October 13, 2025
తూ.గో టీడీపీ అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కేనో..?

తూ.గో టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కేఎస్ జవహర్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆ పదవి ఖాళీ అయింది. ఎస్సీ వర్గానికి చెందిన జవహర్ ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. వైసీపీ, బీజేపీ బీసీలకు, జనసేన కాపు వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్న ఇస్తున్నాయని ప్రచారం సాగుతోంది. ఖాళీ అయిన టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఏ సామాజిక వర్గానికి దక్కుతుందనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.