News January 12, 2026
సిరిసిల్ల: సంక్రాంతికి గ్రామాల్లో వెలుగులు

సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పండుగ వెలుగులు నింపనున్నాయి. నూతన పాలకవర్గాలు గ్రామంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాయి. పాడైన విధి దీపాలతో పాటు, లేనిచోట్ల కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన చౌరస్తాల్లో హైమాస్ లైట్లను కూడా రిపేర్ చేయిస్తున్నారు. దీంతో ఈ సంక్రాంతికి గ్రామాల్లో వెలుగులు విరజిమ్మ నుండగా ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 15, 2026
రేపు కర్నూలు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్: కలెక్టర్

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించనున్నామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీల పరిష్కారం సమాచారం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి కనుక్కోవచ్చని పేర్కొన్నారు. Meekosam.ap.gov.in అర్జీలు నమోదు చేసుకోవాలన్నారు.
News February 15, 2026
విశాఖ తీరంలో జపాన్ నావికుడిని రక్షించిన భారత నౌకాదళం

సముద్రంలో తీవ్ర అనారోగ్యానికి గురైన జపాన్ నావికుడిని భారత నౌకాదళం శనివారం సాహసోపేతంగా రక్షించింది. తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ నౌక నుంచి ‘సీ కింగ్’ హెలికాప్టర్ ద్వారా బాధితుడిని ఎయిర్‌లిఫ్ట్ చేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖలోని నావల్ ఆస్పత్రి కళ్యాణికి తరలించారు. ఈ ఆపరేషన్ భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న పటిష్ఠమైన అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని మరోసారి చాటిచెప్పింది.
News February 15, 2026
NZB: ఆ ఐదుగురిలో మేయర్ ఎవరో?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలువగా అందులో ఐదుగురు మహిళలున్నారు. వారిలో 21వ డివిజన్ నుంచి గెలుపొందిన పంచరెడ్డి లలిత, 49వ డివిజన్ ఉమారాణి, 12వ డివిజన్ దుమాలే అరుంధతి, 9వ డివిజన్ కేతావత్ సురేఖ, 41వ డివిజన్ పూజిత ప్రవీన్ గౌడ్‌లో ఒకరికి మేయర్ పదవి దక్కే అవకాశాలున్నాయి.


