News January 12, 2026
సుందర్ స్థానంలో బదోని

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గాయపడి సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనిని బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో వన్డేకు ఆయన జట్టులో చేరనున్నారు. సుందర్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. లిస్ట్-ఏ క్రికెట్‌లో బదోని 27 మ్యాచుల్లో 693 రన్స్ చేయగా అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే గాయంతో పంత్ ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
Similar News
News February 11, 2026
US-బంగ్లా డీల్.. భారత్‌కు దెబ్బ!

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన ఒప్పందం భారత టెక్స్‌టైల్ రంగంపై ప్రభావం చూపించనుంది. US మెటీరియల్స్(కాటన్, మ్యాన్ మేడ్ టెక్స్‌టైల్స్)తో తయారు చేసిన వస్తువులను జీరో టారిఫ్స్‌తో ఎగుమతి చేసేందుకు బంగ్లాకు అవకాశం దక్కనుంది. కానీ మన వస్త్ర ఎగుమతులపై మాత్రం 18% సుంకం పడనుంది. బంగ్లా కాటన్ దిగుమతుల్లో గతంలో 70% ఇండియా నుంచే వెళ్లేది. ఇటీవల కొంత తగ్గగా, తాజా డీల్‌తో US కాటన్‌కే బంగ్లా మొగ్గుచూపనుంది.
News February 11, 2026
‘మౌంటెడ్ స్ప్రేయర్’తో ఎరువుల పిచికారీ సులభం

అందుబాటులోకి వస్తున్న ఆధునిక పరికరాలు సాగులో రైతు శ్రమను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది రైతులు ‘మౌంటెడ్ స్ప్రేయర్’ అనే పరికరాన్ని వాడుతున్నారు. దీన్ని ట్రాక్టరుకు బిగించి ద్రవరూపంలో ఎరువులను పిచికారీ చేస్తున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో రోజుకు 20 ఎకరాల వరకు స్ప్రే చేయవచ్చు. దీన్ని వాడటం వల్ల కూలీల కొరతను అధిగమించడంతో పాటు మొక్కలకు కూడా సమపాళ్లలో ఎరువులు, మందులను అందించవచ్చు.
News February 11, 2026
హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని ECIL 18 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గలవారు FEB 20న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG, PGDM (మెటీరియల్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్), BE/BTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. DV, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.ecil.co.in/


