News January 12, 2026
అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి పరిష్కారం చూపాలి: JC

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి బాధితులకు పరిష్కారం చూపాలని బాపట్ల జాయింట్ కలెక్టర్ భావన చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ఆమె ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2026
శివుడికి నేడు ఈ ఒక్క పువ్వు సమర్పిస్తే..

మహాశివరాత్రి నాడు శివలింగానికి అపరాజిత పుష్పాలు సమర్పిస్తే అనంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. 11 పూలతో ఆయనను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారని అంటున్నారు. ‘పంచాక్షరి మంత్రం జపిస్తూ పూలు సమర్పించాలి. ఇలా చేస్తే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అపరాజిత జలాభిషేకంతో శివానుగ్రహం లభించి సకల సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు’ అని సూచిస్తున్నారు.
News February 15, 2026
WGL: కార్యకర్తలు ఎవరు? కట్టప్పలు ఎవరు?

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో అధికార-ప్రతిపక్ష అభ్యర్థుల ఓటమిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కాయి. కొన్ని వార్డుల్లో అనూహ్య ఫలితాలు రావడంతో అంతర్గత విభేదాలు, అసంతృప్తి నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి పని చేయాల్సిన వారే ప్రత్యర్థులకు సహకరించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమికి బాధ్యులెవరు అన్న దానిపై నేతలు సమీక్షలు చేపడుతున్నారు.
News February 15, 2026
అఫ్గాన్ ప్లేయర్‌కు బ్యాట్లు గిఫ్టుగా పంపిన కోహ్లీ

అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్‌కు భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ 2 బ్యాట్లు బహుమతిగా ఇచ్చారు. T20 WCలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతడి బ్యాటింగ్‌ను అభినందిస్తూ వాటిని పంపారు. దీనికి గుర్బాజ్ స్పందించారు. ‘అత్యంత అద్భుత బహుమతికి ధన్యవాదాలు కోహ్లీ భాయ్. మీరు లెజెండ్ మాత్రమే కాదు.. అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం’ అని ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 2 సార్లు <<19111177>>సూపర్ ఓవర్<<>> జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవడం తెలిసిందే.


