News January 12, 2026

కరీంనగర్ జిల్లాలో 765 యాక్సిడెంట్స్, 180 మరణాలు

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం చొప్పదండిలో కరీంనగర్ డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన జిల్లాలో 2025లో 765 రోడ్డు ప్రమాదాలు జరిగి 180 మృతి చెందినట్లు తెలిపారు. చొప్పదండిలోనే 31 యాక్సిడెంట్స్ జరిగాయన్నారు. ఓవర్ లోడ్, మద్యం సేవించి డ్రైవ్ చేయడం, మొబైల్ డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు కారణాలని తెలిపారు. రోడ్ సేఫ్టీ కోఆర్డినేటర్ నీలం సంపత్ పాల్గొన్నారు.

Similar News

News February 15, 2026

హుజురాబాద్ : నీళ్లు లేని ఫైర్ ఇంజన్… కళ్లముందే ఇల్లు బూడిద!

image

హుజూరాబాద్‌లోని మారుతినగర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో రిఫ్రిజిరేటర్ పేలి ఇల్లు దగ్ధమైంది. అద్దెకు ఉంటున్న దాసారపు మధునమ్మ ఇంట్లో శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. గూన పెంకుల ఇల్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. హుజురాబాద్ ఫైర్ ఇంజన్‌లో ప్రారంభంలోనే నీరు లేకపోవడం విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి జమ్మికుంట ఫైర్ ఇంజన్ వచ్చి స్థానికుల సహాయం తో మంటలు అదుపులోకి తెచ్చినా భారీ ఆస్తి నష్టం జరిగింది.

News February 15, 2026

కరీంనగర్ మేయర్ పీఠం కమలం వశమే!

image

కరీంనగర్ నగరపాలక సంస్థలో కమల వికాసం ఖాయమైంది. బీజేపీ గెలిచిన 30 స్థానాలకు తోడు, ఇప్పటికే ఇద్దరు చేరగా.. తాజాగా శనివారం మరో ఇద్దరు స్వతంత్ర కార్పొరేటర్లు బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో బీజేపీ బలం ఎక్స్-అఫీషియో ఓటుతో కలిపి 35కు చేరి, మ్యాజిక్ ఫిగర్ (34) దాటింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు తాజా చేరికలతో గండిపడింది.

News February 14, 2026

KNR: కాంగ్రెస్ నేతపై దాడి.. కేసు నమోదు

image

కరీంనగర్ రాజకీయ కక్షలతో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కార్పొరేటర్ భూమయ్య భార్యకు మద్దతుగా ప్రచారం చేశారనే కోపంతో, మాజీ కార్పొరేటర్ సోదరుడు జంగిలి సతీశ్‌తో పాటు మరికొందరు ఆయనపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.