News January 12, 2026

సిరిసిల్ల: ప్రజావాణికి 122 దరఖాస్తుల స్వీకరణ

image

సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమానికి బాధితుల నుంచి 122 దరఖాస్తులు వచ్చాయి. ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీఓ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 13, 2026

బర్డ్ ఫ్లూ భయం.. పడిపోయిన చికెన్ ధరలు

image

AP: ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో <<19090331>>బర్డ్‌ ఫ్లూ బయటపడటంతో<<>> చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. 10 రోజుల కిందటి వరకు కేజీ చికెన్ రూ.300పైనే ఉండగా ప్రస్తుతం రూ.160-180కి తగ్గింది. కాగా బర్డ్‌ఫ్లూ ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేదని అధికారులు చెబుతున్నారు. చికెన్, కోడి గుడ్లను 100 డిగ్రీలపైన వేడితో ఉడికించి తింటే ప్రమాదం లేదంటున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 13, 2026

RGM: వన్ CI, గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని వినతి

image

ఈనెల 10న గోదావరిఖనికి చెందిన మార్కాపురి తిలక్ న్యాయవాదిపై వన్ టౌన్ CI ఇంద్రసేనారెడ్డి అనుచిత ప్రవర్తన, దాడి చేసిన గన్ మెన్ పై చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను బార్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ విషయంలో CIపై చర్యలు తీసుకోవాలని CPని కోరారు. చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరుకామని లాయర్లు పిలుపునిచ్చారు.

News February 13, 2026

సిద్దిపేట: మూడు మున్సిపాలిటీల్లో ‘గులాబీ’ జెండా రెపరెపలు

image

సిద్దిపేట జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తన కంచుకోటలను నిలబెట్టుకుంది. గజ్వేల్, చేర్యాల, దుబ్బాకలో స్పష్టమైన మెజారిటీ సాధించి పీఠాలను కైవసం చేసుకుంది. గజ్వేల్‌లో 11, చేర్యాలలో 7 స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. హుస్నాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ 16 సీట్లతో విజయదుందుభి మోగించింది. మారిన రాజకీయ సమీకరణాల్లోనూ బీఆర్‌ఎస్ 3 చోట్ల మ్యాజిక్ ఫిగర్ రావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.