News January 12, 2026

గద్వాల: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: డిప్యూటీ సీఎం

image

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు, యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి సిద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన, వార్డుల వారీగా తుది ఓటర్ జాబితా విడుదలైనందున మిగిలిన ఎన్నికల ప్రక్రియను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు.

Similar News

News January 24, 2026

పాదగయలో యథాప్రకారం పూజలు: ఆలయ అసిస్టెంట్ కమిషనర్

image

పిఠాపురం పాదగయలో శుక్రవారం పురోహితులు, వైష్ణవుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పూజలు నిలిపేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీనిపై ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కాట్నం జగన్మోహన శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని, పూజలు ఆపలేదని పేర్కొన్నారు. అభిషేకాలు, అర్చనలు యథాప్రకారం జరుగుతాయన్నారు. ఆ రెండు వర్గాల మధ్య దీర్ఘకాలంగా వివాదం ఉందని, వాటిని పూజలకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు.

News January 24, 2026

నిర్మల్ ఉత్సవాలు మరొక రోజు పొడిగింపు: కలెక్టర్

image

ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలను ఆదరిస్తున్నందుకు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ అభిలాష అభినవ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజల కోరిక మేరకు నేటితో ముగియాల్సిన నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని మరొక రోజు (శనివారం వరకు) పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఐదో రోజు నిర్మల్ ఉత్సవాల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, కళాకారులు పాల్గొన్నారు.

News January 24, 2026

బాసర ఆలయానికి ఒక్కరోజు ఆదాయం ఎంతంటే..?

image

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో ఈరోజు దర్శించుకున్నారు. వసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో భక్తులు తమ చిన్నారులకు ప్రత్యేక రూ.1,000 అక్షరాభ్యాసం 3,850 టికెట్లు, రూ.150 సాధారణ అక్షరాభ్యాసం టికెట్లు 2,475, ప్రత్యేక దర్శనం, లడ్డూ, పులిహోర ప్రసాదం వివిధ అర్జితసేవ టికెట్ల ద్వారా ఆలయానికి ఒక్కరోజు ఆదాయం మొత్తం రూ.56,38,275 వచ్చినట్లు ఆలయ ఈవో అంజనాదేవి తెలిపారు.