News January 12, 2026
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం.. చేతల ప్రభుత్వం కాదు: MLA

కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదని నిజామాబాద్ అర్బన్ MLA ధన్పాల్ సూర్య నారాయణ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రెండున్నర ఏళ్లలో సీడీపీ నిధులు శూన్యమన్నారు. అర్బన్‌ను రూ.500 కోట్లతో అభివృధ్ది చేశామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. కాగా ఓడిన కాంగ్రెస్ అభ్యర్థికి పది కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలుపాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 17, 2026
‘కుతల ఆర్భాటమే కానీ కుప్పలో గింజలు లేవు’

కొందరు వ్యక్తులు తమకు అన్నీ తెలుసని, తాము చాలా గొప్పవారమని గంభీరమైన మాటలు చెబుతుంటారు. కానీ పని అప్పగిస్తే ఏమీ చేయలేరు. అలాగే పెద్ద కుప్పలా ఉన్న ధాన్యాన్ని గాలికి ఎగబోసేటప్పుడు అందులో నుంచి శబ్ధం(కుతల) వస్తుంది. తీరా చూస్తే అందులో అసలైన గింజలు (ధాన్యం) లేకుండా, కేవలం పొట్టు లేదా తాలు మాత్రమే ఉంటే “వట్టి కుతల ఆర్భాటమే తప్ప, కుప్పలో గింజలు లేవు” అనే సామెతను రైతులు వాడుతుంటారు.
News February 17, 2026
అధిక మాసం ఎలా ఏర్పడుతుందో తెలుసా?

భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365.25 రోజులు పడుతుంది. అయితే చంద్రుని గమనం ఆధారంగా 12 మాసాలకు 354 రోజులు పడుతుంది. ఈ రెండింటి మధ్య ఏటా వచ్చే 11 రోజుల తేడాను సవరించడానికి ప్రతి మూడేళ్లకు ఓసారి ఓ నెలను అదనంగా కలుపుతారు. దీనినే అధిక మాసం అంటారు. ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో ఆ నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. ఇది పండుగలు, రుతువుల క్రమం తప్పకుండా ఉండటానికి సహాయపడుతుంది.
News February 17, 2026
ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసిన ఇండియా!

ఇరాన్‌కు చెందిన 3 ఆయిల్ ట్యాంకర్లను ఇటీవల ముంబై తీరంలో ఇండియా స్వాధీనం చేసుకుందని Reuters వెల్లడించింది. వీటిపై US ఆంక్షలు ఉన్నట్లు చెప్పింది. ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు, ట్రాకింగ్‌కు దొరక్కుండా, ఐడెంటిటీ తెలియకుండా చేసే షిప్-టు-షిప్ ట్రాన్స్‌ఫర్స్‌కు తమ జలాలను ఎవరూ ఉపయోగించకూడదని ఇండియా కోరుకుంటోందని పేర్కొంది. ఈ నౌకలు తరచూ గుర్తింపు మార్చుకుంటాయని, వాటి ఓనర్లు విదేశాల్లో ఉన్నారని తెలిపింది.


